పూర్తి ఫిట్‌నెస్ సాధిస్తా: కశ్యప్ | Full Fitness sure: Kashyap | Sakshi
Sakshi News home page

పూర్తి ఫిట్‌నెస్ సాధిస్తా: కశ్యప్

Jun 25 2015 2:58 AM | Updated on Sep 3 2017 4:18 AM

జకర్తాలో ఆగస్టులో జరగనున్న బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్ సమయానికి పూర్తి ఫిట్‌నెస్ సాధిస్తానని స్టార్ ప్లేయర్ పారుపల్లి

ముంబై : జకర్తాలో ఆగస్టులో జరగనున్న బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్ సమయానికి పూర్తి ఫిట్‌నెస్ సాధిస్తానని స్టార్ ప్లేయర్ పారుపల్లి కశ్యప్ చెప్పాడు. దీనికోసం ఏడు వారాల పాటు కఠినంగా శ్రమిస్తానని వెల్లడించాడు. సరైన ఫిట్‌నెస్ లేకపోవడం వల్లే ఇండోనేసియా ఓపెన్ సెమీస్‌లో ఓటమిపాలయ్యానన్నాడు. ‘క్వార్టర్స్‌లో చెన్ లాంగ్‌పై గెలవడం నా ఆత్మ విశ్వాసాన్ని పెంచింది. టాప్-10 ఆటగాళ్లకు ఒక్కో రకమైన శైలి ఉంటుంది.

వాళ్లతో తలపడేటప్పుడు ముందుకు ఎలా సాగాలనే దానిపై కచ్చితమైన ప్రణాళిక ఉండాలి. అందుకే రెండో గేమ్‌లో 10-6తో ఆధిక్యంలో ఉన్నా... అతనిపై ఒత్తిడి పెంచలేకపోయా. అలాంటప్పుడు మరింత ఫిట్‌నెస్ అవసరమని తెలుసుకున్నా’ అని కశ్యప్ పేర్కొన్నాడు.

Advertisement
 
Advertisement
Advertisement