బతుకుదెరువు కోసం పోర్న్‌స్టార్‌‌గా.. | Former Supercars Racer Renee Gracie Switches To Pornography | Sakshi
Sakshi News home page

బతుకుదెరువు కోసం పోర్న్‌స్టార్‌‌గా కార్‌ రేసర్‌

Jun 9 2020 12:13 PM | Updated on Jun 9 2020 12:40 PM

Former Supercars Racer Renee Gracie Switches To Pornography - Sakshi

సిడ్నీ : ఆస్ట్రేలియాకు చెందిన 25 ఏళ్ల రెనీ గ్రేసీ చిన్నతనంలోనే కార్‌ రేసింగ్‌లో గొప్ప రికార్డులను సాధించి చాంపియన్‌గా మారింది. పేరుకు పేరు, డబ్బుకు డబ్బు సంపాదించిన గ్రేసీ ప్రస్తుతం పరిస్థితులు అనుకూలించక బతుకుదెరువు కోసం పోర్న్‌స్టార్‌ అవతారమెత్తింది. వి8 సూపర్‌కార్‌ సిరీస్‌ మొత్తం పూర్తి చేసిన మొదటి మహిళగా గ్రేసీ రికార్డు సాధించింది. అలాంటి రెనీ గ్రేసీ 2017 నుంచి రేసింగ్‌లో ప్రదర్శన దిగజారడం, ఆర్థికంగా చితికిపోయింది. దీంతో బతుకుదెరువు కోసం కొన్నాళ్లు కారు యార్డులో కూడా పని చేసింది. అయితే వచ్చిన డబ్బులు సరిపోక ఇంకా ఏం చేస్తే మరింత డబ్బు సంపాదించగలనని గ్రేసీ ఆలోచించింది. ఒకరోజు ఓన్లీఫ్యాన్స్‌ అనే అడల్ట్‌ వెబ్‌సైట్‌ను చూశాక డబ్బులు సంపాదించడానికి పోర్న్‌స్టార్‌గా మారడమే కరెక్టని భావించింది. అంతే వారం రోజుల వ్యవధిలోనే గ్రేసీ తన నగ్న ఫోటోలు, వీడియోలు పోస్ట్‌ చేసి రూ. రెండున్నర లక్షలు సంపాదించింది. తన జీవితంలో చేసిన మంచి పని ఏదైనా ఉందంటే అది పోర్న్‌స్టార్‌గా మారడమేనని గ్రేసీ తెలిపింది.(24 గంటల్లో 9,987 కేసులు, 331 మరణాలు)

'నన్ను ఎవరు ఎలా పిలిచినా నాకు అభ్యంతరం లేదు. ఇప్పుడు నేను చేస్తున్నపనికి సిగ్గుపడడం లేదు. పోర్న్‌ వృత్తిలోకి దిగి డబ్బులు సంపాదించడం వల్ల నేనేం చెడ్డదాన్ని కాలేదు. అయినా ఈ నిర్ణయం గుడ్డిగా మాత్రం తీసుకోలేదు. ఈ రంగంలోకి రావడానికి ముందు బాగా ఆలోచించా. ఒకప్పుడు రేసర్‌గా రాణించిన నేను బతుకుదెరువు కోసం పోర్న్‌ రంగంలోకి అడుగుపెట్టాల్సి వచ్చింది. నా జీవితంలో నేను తీసుకున్న నిర్ణయాల్లో దీనినే అత్యుత్తమంగా భావిస్తున్నా' అంటూ రెనీ గ్రేసీ చెప్పుకొచ్చింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement