‘ఐటా’ తీరు ఆశ్చర్యం కలిగించలేదు! | Former India Captain Mahesh Bhupathi Was Treated Badly By The AITA | Sakshi
Sakshi News home page

‘ఐటా’ తీరు ఆశ్చర్యం కలిగించలేదు!

Nov 29 2019 5:26 AM | Updated on Nov 29 2019 5:26 AM

Former India Captain Mahesh Bhupathi Was Treated Badly By The AITA - Sakshi

ముంబై: అఖిల భారత టెన్నిస్‌ సంఘం (ఐటా) తనతో వ్యవహరించిన తీరు తనను తీవ్రంగా బాధించిందని మాజీ ఆటగాడు మహేశ్‌ భూపతి వ్యాఖ్యానించాడు. అయితే ‘ఐటా’ గత రికార్డును బట్టి చూస్తే ఇది తనకు ఏమాత్రం ఆశ్చర్యం కలిగించలేదని అతను అన్నాడు. పాకిస్తాన్‌తో జరిగే  డేవిస్‌ కప్‌ మ్యాచ్‌ కోసం ముందుగా మహేశ్‌నే నాన్‌ప్లేయింగ్‌ కెప్టెన్‌గా ‘ఐటా’ ఎంపిక చేసింది. అయితే అతను పాకిస్తాన్‌ ప్రయాణించేందుకు ఇష్టపడటం లేదంటూ తొలగించింది. దీనిపై భూపతి స్పందించాడు.

‘నేను కెప్టెన్‌గా పనికి రానని వారు భావిస్తే తప్పు లేదు. కానీ ప్రస్తుతం నీకు బదులుగా మరొకరిని ఎంపిక చేస్తున్నామని ఒక్క ఫోన్‌ కాల్‌  చేసినా బాగుండేది. కానీ నాకు కనీస సమాచారం కూడా అందించలేదు. నన్ను కెప్టెన్‌గా ఎంపిక చేయాలని భావించిన రోజున హైదరాబాద్‌కు వచ్చి మరీ నాతో కలిసి మాట్లాడారు. కానీ ఇప్పుడు వారి ప్రవర్తన తీవ్ర నిరాశ కలిగించింది. నేను బాధ పడటం కూడా సహజం. అయితే  గత ఇరవై ఏళ్లుగా భారత టెన్నిస్‌ సంఘం పలువురు ఆటగాళ్లతో వ్యవహరించిన తీరును బట్టి చూస్తే ఇది ఆశ్చర్యం కలిగించలేదు’ అని భూపతి వివరించాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement