breaking news
Mahesh Bhupathi (tennis player)
-
‘ఐటా’ తీరు ఆశ్చర్యం కలిగించలేదు!
ముంబై: అఖిల భారత టెన్నిస్ సంఘం (ఐటా) తనతో వ్యవహరించిన తీరు తనను తీవ్రంగా బాధించిందని మాజీ ఆటగాడు మహేశ్ భూపతి వ్యాఖ్యానించాడు. అయితే ‘ఐటా’ గత రికార్డును బట్టి చూస్తే ఇది తనకు ఏమాత్రం ఆశ్చర్యం కలిగించలేదని అతను అన్నాడు. పాకిస్తాన్‌తో జరిగే డేవిస్ కప్ మ్యాచ్ కోసం ముందుగా మహేశ్నే నాన్‌ప్లేయింగ్ కెప్టెన్‌గా ‘ఐటా’ ఎంపిక చేసింది. అయితే అతను పాకిస్తాన్ ప్రయాణించేందుకు ఇష్టపడటం లేదంటూ తొలగించింది. దీనిపై భూపతి స్పందించాడు. ‘నేను కెప్టెన్‌గా పనికి రానని వారు భావిస్తే తప్పు లేదు. కానీ ప్రస్తుతం నీకు బదులుగా మరొకరిని ఎంపిక చేస్తున్నామని ఒక్క ఫోన్ కాల్ చేసినా బాగుండేది. కానీ నాకు కనీస సమాచారం కూడా అందించలేదు. నన్ను కెప్టెన్‌గా ఎంపిక చేయాలని భావించిన రోజున హైదరాబాద్‌కు వచ్చి మరీ నాతో కలిసి మాట్లాడారు. కానీ ఇప్పుడు వారి ప్రవర్తన తీవ్ర నిరాశ కలిగించింది. నేను బాధ పడటం కూడా సహజం. అయితే గత ఇరవై ఏళ్లుగా భారత టెన్నిస్ సంఘం పలువురు ఆటగాళ్లతో వ్యవహరించిన తీరును బట్టి చూస్తే ఇది ఆశ్చర్యం కలిగించలేదు’ అని భూపతి వివరించాడు. -
జూన్ 7న పుట్టిన రోజు జరుపుకుంటున్న ప్రముఖులు
ఈరోజు మీతో పాటు పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రముఖులు: మహేష్ భూపతి (టెన్నిస్ ఆటగాడు), ఏక్తాకపూర్(టీవీ సినీ నిర్మాత) ఈరోజు పుట్టిన రోజు జరుపుకుంటున్న వారి వ్యక్తిగత సంవత్సర సంఖ్య 3. వీరు ఈ సంవత్సరం చదువుల్లో రాణిస్తారు. విదేశాలలో చదువుకోవడం కోసం, ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, కెమికల్, రక్షణ రంగాలలోని వారు మంచి పేరు తెచ్చుకుంటారు. రిసెర్చ్ వర్క్‌లో ఉన్న వారి పరిశోధనలు వెలుగు చూస్తాయి. గతంలో వీరు ఎలాంటి వారయినప్పటికీ, బృహస్పతి ప్రభావం వల్ల ఈ సంవత్సరం వీరి మాట తీరులో, నడతలో మంచి మార్పు వ స్తుంది. అందరి చేతా మంచి వారనిపించుకుంటారు. సంగీతం, ఇన్‌స్ట్రమెంటల్ మ్యూజిక్ రంగాలలో ఉన్న వారికి గొప్ప పేరు ప్రతిష్ఠలు లభిస్తాయి. ఆధ్యాత్మికతపై మక్కువ పెరుగుతుంది. ఉద్యోగులకు ప్రమోషన్లు రాకపోయినా, జీతం బాగానే పెరుగుతుంది కాబట్టి నిరాశ పడనక్కరలేదు. అయితే వివిధ కారణాల వల్ల వీరు కొంతకాలం పాటు కుటుంబానికి, సంసార జీవనానికి దూరంగా ఉండవలసిన పరిస్థితి ఏర్పడవచ్చు. లక్కీ నంబర్స్: 1,2,3,7,9; లక్కీ కలర్స్: వైట్, ఎల్లో, క్రీమ్, గోల్డ్; సూచనలు: దక్షిణామూర్తికి అభిషేకం, గురువులను సేవించడం, ఆవుకు సెనగలు తినిపించడం. - డా. మహమ్మద్ దావూద్ జ్యోతిష, సంఖ్యాశాస్త్ర నిపుణులు