అథ్లెటిక్స్‌లో విదేశీ కోచ్‌లు | Foreign coaches in athletics | Sakshi
Sakshi News home page

అథ్లెటిక్స్‌లో విదేశీ కోచ్‌లు

Apr 7 2017 12:52 AM | Updated on Oct 4 2018 8:09 PM

అంతర్జాతీయ వేదికలపై భారత క్రీడాకారులు సత్తా చాటేందుకు అథ్లెటిక్స్‌ విభాగంలో విదేశీ కోచ్‌ల నియామకానికి కేంద్ర క్రీడా శాఖ

న్యూఢిల్లీ: అంతర్జాతీయ వేదికలపై భారత క్రీడాకారులు సత్తా చాటేందుకు అథ్లెటిక్స్‌ విభాగంలో విదేశీ కోచ్‌ల నియామకానికి కేంద్ర క్రీడా శాఖ మంత్రి విజయ్‌ గోయెల్‌ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారు. ఈ మేరకు రేస్‌వాకింగ్, 400మీ. పరుగు,  400మీ.రిలే విభాగాలకు విదేశీ కోచ్‌లతో పాటు సహాయక సిబ్బందిని నియమించారు. ఆస్ట్రేలియాకు చెందిన డేవ్‌ స్మిత్‌ రేస్‌ వాకింగ్‌ ఈవెంట్‌కు, గలీనా పి బుఖరీనా (అమెరికా) 400మీ. పరుగు విభాగాలకు కోచ్‌లుగా వ్యవహరిస్తారు.

Advertisement
 
Advertisement
Advertisement