
బిరాట్‌నగర్ (నేపాల్): తమ జైత్రయాత్రను కొనసాగిస్తూ భారత మహిళల జట్టు దక్షిణాసియా (శాఫ్) ఫుట్‌బాల్ చాంపియన్‌షిప్‌లో వరుసగా ఐదోసారి టైటిల్ పోరుకు అర్హత సాధించింది. బంగ్లాదేశ్‌తో బుధవారం జరిగిన తొలి సెమీఫైనల్లో భారత్ 4–0తో ఘనవిజయం సాధించింది. ఆట 18వ నిమిషంలో దలీమా చిబ్బెర్ గోల్‌తో ఖాతా తెరిచిన భారత్‌కు 22వ, 37వ నిమిషాల్లో ఇందుమతి రెండు గోల్స్ అందించిది. విరామ సమయానికి భారత్ 3–0తో ఆధిక్యంలో నిలిచింది. రెండో అర్ధభాగంలోనూ భారత్ తమ ఆధిపత్యాన్ని చాటుకుంది.
మ్యాచ్ చివరి నిమిషాల్లో మనీషా గోల్ అందించడంతో భారత్ 4–0తో విజయా న్ని ఖాయం చేసుకుంది. రెండో సెమీఫైనల్లో ఆతిథ్య నేపాల్ 4–0తో శ్రీలంకను ఓడించింది. శుక్రవారం జరిగే ఫైనల్లో నేపాల్‌తో భారత్ అమీతుమీ తేల్చుకుంటుంది. ఇప్పటివరకు ‘శాఫ్’ చాంపియన్‌షిప్ (2010, 2012, 2014, 2016) నాలుగుసార్లు జరుగగా... నాలుగుసార్లూ భారత్‌కే టైటిల్ లభించింది.