వెస్టిండీస్ తో సిరీస్ కు టీమిండియా కోచ్ దూరం! | Fletcher may not stay for the WI series, BCCI official | Sakshi
Sakshi News home page

వెస్టిండీస్ తో సిరీస్ కు టీమిండియా కోచ్ దూరం!

Aug 19 2014 4:43 PM | Updated on Sep 2 2017 12:07 PM

వెస్టిండీస్ తో సిరీస్ కు టీమిండియా కోచ్ దూరం!

వెస్టిండీస్ తో సిరీస్ కు టీమిండియా కోచ్ దూరం!

త్వరలో వెస్టిండీస్ తో భారత్ లో జరిగే సిరీస్ కు టీమిండియా కోచ్ డంకెన్ ఫ్లెచర్ దూరం కానున్నాడు.

న్యూఢిల్లీ: త్వరలో వెస్టిండీస్ తో భారత్ లో జరిగే సిరీస్ కు టీమిండియా కోచ్ డంకెన్ ఫ్లెచర్ దూరం కానున్నాడు. ఇంగ్లండ్ లో ఘోర వైఫల్యం అనంతరం ఫ్లెచర్ పై విమర్శల వెల్లువ ఉప్పెనలా వచ్చి పడటంతో అతను భారత్ కోచ్ పదవి నుంచి తప్పుకోనున్నట్లు ప్రాధమిక సమాచారం. వెస్టిండీస్ తో జరిగే సిరీస్ కు ఫ్లెచర్ అందుబాటులో ఉండకపోవచ్చని స్వయంగా బీసీసీఐ అధికారి ఒకరు స్పష్టం చేశారు. ప్రస్తుతం భారత్ జట్టులోని లోపాలను సరిదిద్దేందుకు మాజీ ఆటగాడు రవిశాస్త్రిని టీమిండియా డైరెక్టర్ గా నియమించి ఫ్లెచర్ పాత్రను తగ్గించడంతోనే అతను భారత్ కోచ్ బాధ్యతలను మోసేందుకు సిద్ధంగా లేనట్లు తెలుస్తోంది.

 

'వచ్చే సిరీస్ కు ముందుగానే ఫ్లెచర్ కోచ్ బాధ్యతల నుంచి తప్పుకోవాలనుకుంటున్నాడు. ఒకవేళ అతను వెళ్లాలనుకుంటే బోర్డు ఆపే ప్రయత్నం చేయదు'అని ఆ అధికారి తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement