పచ్చికపై మరో పసందైన పోరు | Five ways Roger Federer can win Wimbledon final | Sakshi
Sakshi News home page

పచ్చికపై మరో పసందైన పోరు

Jul 12 2015 4:45 PM | Updated on Sep 3 2017 5:19 AM

పచ్చికపై మరో పసందైన పోరు

పచ్చికపై మరో పసందైన పోరు

పచ్చికపై మరో పసందైన పోరుకు రంగం సిద్ధమైంది. ఈసారీ టైటిల్ నిలబెట్టుకోవాలని నొవాక్ జొకోవిచ్ (సెర్బియా)... గతేడాది ఎదురైన ఓటమికి లెక్క సరిచేసి ఎనిమిదోసారి విజేతగా నిలవాలని ఫెడరర్ (స్విట్జర్లాండ్)..

 వింబుల్డన్ ఫైనల్లో జొకోవిచ్‌తో అమీతుమీ
 సా.గం. 6.30 నుంచి స్టార్ స్పోర్ట్స్-2లో ప్రత్యక్ష ప్రసారం

 
 లండన్: పచ్చికపై మరో పసందైన పోరుకు రంగం సిద్ధమైంది. ఈసారీ టైటిల్ నిలబెట్టుకోవాలని నొవాక్ జొకోవిచ్ (సెర్బియా)... గతేడాది ఎదురైన ఓటమికి లెక్క సరిచేసి ఎనిమిదోసారి విజేతగా నిలవాలని ఫెడరర్ (స్విట్జర్లాండ్).. ఆదివారం జరిగే వింబుల్డన్ గ్రాండ్‌స్లామ్ టోర్నీ పురుషుల సింగిల్స్ టైటిల్ పోరులో అమీతుమీ తేల్చుకోనున్నారు.

ముఖాముఖి రికార్డులో ఫెడరర్ 20-19తో జొకోవిచ్‌పై ఆధిక్యంలో ఉన్నాడు. ఫెడరర్ గెలిస్తే వింబుల్డన్ సింగిల్స్ టైటిల్‌ను అత్యధికంగా 8 సార్లు నెగ్గిన తొలి ప్లేయర్‌గా రికార్డు సృష్టిస్తాడు. అంతేకాకుండా 33 ఏళ్ల వయస్సులో ఈ టైటిల్ సాధిం చిన తొలి క్రీడాకారుడిగా గుర్తింపు పొందుతాడు. గ్రాండ్‌స్లామ్ ఫైనల్స్‌లో వీరిద్దరు తలపడటం ఇది మూడోసారి. 2007 యూఎస్ ఓపెన్ ఫైనల్లో జొకోవిచ్‌పై నెగ్గిన ఫెడరర్... గతేడాది వింబుల్డన్ ఫైనల్లో ఓడిపోయాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement