ఆనంద్‌కు తొలి గెలుపు | First win to Anand | Sakshi
Sakshi News home page

ఆనంద్‌కు తొలి గెలుపు

Apr 22 2015 1:25 AM | Updated on Sep 3 2017 12:38 AM

వుగార్ గషిమోవ్ స్మారక అంతర్జాతీయ చెస్ టోర్నమెంట్‌లో భారత గ్రాండ్‌మాస్టర్ విశ్వనాథన్ ఆనంద్ తొలి విజయాన్ని సాధించాడు.

షామ్‌కిర్ (అజర్‌బైజాన్) : వుగార్ గషిమోవ్ స్మారక అంతర్జాతీయ చెస్ టోర్నమెంట్‌లో భారత గ్రాండ్‌మాస్టర్ విశ్వనాథన్ ఆనంద్ తొలి విజయాన్ని సాధించాడు. వరుసగా నాలుగు గేమ్‌లను ‘డ్రా’ చేసుకున్న ఈ ప్రపంచ మాజీ చాంపియన్‌కు ఐదో రౌండ్‌లో విజయం దక్కింది. అమెరికా గ్రాండ్‌మాస్టర్ వెస్లీ సోతో మంగళవారం జరిగిన ఐదో రౌండ్‌లో తెల్ల పావులతో ఆడిన ఆనంద్ 45 ఎత్తుల్లో గెలుపొందాడు. ఈ టోర్నీలో వెస్లీ సోకిదే తొలి ఓటమి కావడం గమనార్హం. బుధవారం విశ్రాంతి దినం తర్వాత గురువారం జరిగే ఆరో రౌండ్‌లో రవూఫ్ మమెదోవ్ (అజర్‌బైజాన్)తో ఆనంద్ తలపడతాడు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement