హోరెత్తిన ఉప్పల్ | first ipl match in hyderabad | Sakshi
Sakshi News home page

హోరెత్తిన ఉప్పల్

May 13 2014 12:55 AM | Updated on Oct 2 2018 2:44 PM

హోరెత్తిన ఉప్పల్ - Sakshi

హోరెత్తిన ఉప్పల్

ఈ సీజన్‌లో ఉప్పల్‌లో తొలి ఐపీఎల్ మ్యాచ్‌కు అభిమానులు పోటెత్తారు.

సాక్షి, హైదరాబాద్: ఈ సీజన్‌లో ఉప్పల్‌లో తొలి ఐపీఎల్ మ్యాచ్‌కు అభిమానులు పోటెత్తారు. ఆరంభంలో కాస్త పలుచగా కనిపించినా... మ్యాచ్ ప్రారంభమయ్యే సమయానికి స్టాండ్స్ అన్నీ నిండిపోయాయి. సినీ నటుడు వెంకటేశ్, సుశాంత్ సింగ్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. గతంతో పోలిస్తే ఈ సారి మ్యాచ్ సందర్భంగా ప్రేక్షకులు బాగానే ట్రాఫిక్ ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ముంబై ఇండియన్స్ మెంటర్ సచిన్ రాకపోవడంతో... మాస్టర్‌ను ప్రత్యక్షంగా చూద్దామని ఆశించిన అభిమానులు నిరాశచెందారు.

Advertisement
 
Advertisement
Advertisement