ఎట్టకేలకు హైదరాబాద్ బోణీ | Finally to Boney Hyderabad | Sakshi
Sakshi News home page

ఎట్టకేలకు హైదరాబాద్ బోణీ

Jan 9 2015 2:25 AM | Updated on Sep 19 2018 6:31 PM

ఎట్టకేలకు హైదరాబాద్ బోణీ - Sakshi

ఎట్టకేలకు హైదరాబాద్ బోణీ

ఈ సీజన్‌లో హైదరాబాద్ జట్టు ఎట్టకేలకు తొలి విజయాన్ని నమోదు చేసింది. 9 వికెట్ల తేడాతో త్రిపురపై గెలుపొందింది.

అగర్తలా: ఈ సీజన్‌లో హైదరాబాద్ జట్టు ఎట్టకేలకు తొలి విజయాన్ని నమోదు చేసింది. 9 వికెట్ల తేడాతో త్రిపురపై గెలుపొందింది. నాలుగో రోజు 240/4 ఓవర్‌నైట్ స్కోరుతో రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన త్రిపుర 119.1 ఓవర్లలో 351 పరుగుల వద్ద ఆలౌటైంది. రాకేశ్ సోలంకి (127 బంతుల్లో 85, 12 ఫోర్లు) అర్ధసెంచరీ చేశాడు. హైదరాబాద్ బౌలర్లలో మిలింద్ 4, అన్వర్, ఆకాశ్ భండారి చెరో 2 వికెట్లు తీశారు. తర్వాత 45 పరుగుల లక్ష్యాన్ని హైదరాబాద్ 6.5 ఓవర్లలో వికెట్ నష్టానికి 48 పరుగులు చేసి ఛేదించింది. అక్షత్ 27, అగర్వాల్ 21 (నాటౌట్) పరుగులు చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement