కరోనాపై గెలుపొందాలి

Fight against COVID-19 is mother of all World Cups - Sakshi

ఇప్పుడది ప్రపంచకప్‌కంటే గొప్ప విజయంలాంటిది

భారత క్రికెట్‌ హెడ్‌కోచ్‌ రవిశాస్త్రి వీడియో సందేశం  

న్యూఢిల్లీ: భారత క్రికెట్‌ హెడ్‌కోచ్‌ రవిశాస్త్రి కోవిడ్‌–19పై విజయం ఓ మెగా ప్రపంచకప్‌ విజయం లాంటిదని అన్నారు. బుధవారం ఆయన ఓ వీడియో సందేశాన్ని విడుదల చేశారు. ‘అన్ని ప్రపంచకప్‌లకంటే పెద్దది ఈ మహమ్మారి. దీనిపై పోరాటం చేయాలి. గెలవాలి. ఇందులో గెలిస్తే ప్రపంచకప్‌ను సాధించినట్లే. దీని కోసం మనం రెండు లక్ష్యాలు పెట్టుకోవాలి... ఒకటి ఇంట్లోనే ఉండటం. రెండోది భౌతిక దూరం పాటించడం’ అని ఈ వీడియోలో పేర్కొన్నారు.

శాస్త్రి ఓ కోచే కాదు... మాజీ ఆల్‌రౌండర్, ఆ తర్వా త మంచి వ్యాఖ్యాత కూడా! అం దుకే తనదైన కామెంటేటర్‌ శైలిలో వీడియో సందేశమిచ్చారు. ‘కరోనా మనల్ని ఇంట్లోనే కట్టేసింది. నాలుగ్గోడలకు పరిమితం చేసిన ఈ మహమ్మారిని ఛేదించడం ప్రపంచకప్‌ లక్ష్యాన్ని ఛేదించడం లాంటిది. అందుకే అందరం కలసికట్టుగా ఈ కప్‌ గెలవాలంటే... కరోనాను ఓడించాల్సిందే. నిజానికి ఇది మామూలు ప్రపంచకప్‌ కప్‌ కాదు సుమా! అందుకే దీన్ని ఓడించేందుకు ఫైనల్‌ ఎలెవన్‌ జట్టు సరిపోదు. కోట్ల మంది టీమిండియా తరఫున పోరాడాలి. అప్పుడే గెలుస్తాం. అందరూ దృఢ సంకల్పంతో ఉండండి. కరోనాను భారత్‌ నుంచి తరిమేయండి’ అని రవిశాస్త్రి ప్రజల్ని జాగృతం చేస్తున్నారు.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top