అలెక్స్‌ హేల్స్‌కు కరోనా సోకిందా?

England's Alex Hales Might Have Covid-19 symptoms Says Ramiz Raja - Sakshi

లాహోర్‌ : ఇంగ్లండ్‌ ఆటగాడు అలెక్స్‌ హేల్స్‌పై పాకిస్తాన్‌ మాజీ కెప్టెన్‌, కామెంటేటర్‌ రమీజ్‌రాజా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. పాకిస్తాన్‌ సూపర్‌లీగ్‌లో ఆడేందుకు వచ్చిన హేల్స్‌ అతను వెళ్లే ముందు కరోనా లక్షణాలు ఉన్నట్లుగా అనుమానమొచ్చిందని పేర్కొన్నాడు.  లాహోర్‌లో మీడియా సమావేశంలో పాల్గొన్న రమీజ్‌ ఈ వ్యాఖ్యలు చేశాడు. అంతకుముందు పాకిస్తాన్‌ సూపర్‌ లీగ్‌లో భాగంగా మంగళవారం జరగాల్సిన సెమీ ఫైనల్‌ మ్యాచ్‌లతో పాటు ఫైనల్‌ను కూడా వాయిదా వేస్తున్నట్లు పీసీబీ తెలిపింది.

'అలెక్స్‌ హేల్స్‌ కు కరోనా లక్షణాలు ఉన్నాయో లేదో స్పష్టంగా తెలీదు.. కానీ అతను పరీక్షలు చేసుకుంటే మంచిదని నా అభిప్రాయం.మేము కూడా ఈ విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. కరోనా వైరస్‌ నేపథ్యంలో పీఎస్‌ఎల్‌ను వాయిదా వేసి పీసీబీ మంచి పని చేసింది. ప్రేక్షకులు లేకుండా ఖాళీ స్టేడియాల్లో మ్యాచ్‌లు నిర్వహించడం వ్యర్థమైన పని.. ఇలాగే సెమీస్‌, ఫైనల్‌ మ్యాచ్‌లు నిర్వహించి ఉంటే లీగ్‌ అట్టర్‌ఫ్లాఫ్‌ అయ్యేది. కరోనా నేపథ్యంలో ప్రస్తుతం పరిస్థితులు కఠినంగా ఉన్నాయి. ఈ సమయంలో లీగ్‌ను వాయిదా వేయడం తప్ప ఇంకో అవకాశం తీసుకోదలచుకోలేదు ' అని రమీజ్‌ పేర్కొన్నాడు. (కరోనా సోకి యువ కోచ్‌ మృతి)

కాగా పీఎస్‌ఎల్‌లో అలెక్స్‌ హేల్స్‌ కరాచీ కింగ్స్‌ తరపున ప్రాతినిథ్యం వహించాడు. కరోనా వైరస్‌ నేపథ్యంలో ఇంగ్లండ్‌ ఆటగాళ్లు లీగ్‌ మధ్యలోనే వెనుదిరిగిన సంగతి తెలిసిందే. లీగ్‌ నిర్వాహకులు వారందరికి ప్రత్యేక విమానం ఏర్పాటు చేసి వారి స్వదేశానికి పంపించింది.  ఇదే విషయమై.. పాకిస్తాన్‌ క్రికెట్‌ బోర్డ్‌ సీఈవో వసీమ్‌ ఖాన్‌ మాట్లాడుతూ.. ' లీగ్‌లో పాల్గొన్న విదేశీ ఆటగాళ్లలో కొందరు కరోనా బారీన పడ్డారేమోనని మాకు అనుమానంగా ఉంది. కానీ వారి పేర్లు వెల్లడించడం నాకు ఇష్టం లేదు. ఇ‍ప్పటికే లీగ్‌లో పాల్గొన్న ఆటగాళ్లతో పాటు నిర్వాహకులకు, బ్రాడ్‌కాస్టర్లకు కోవిడ్‌ టెస్టులు చేయించామని' తెలిపాడు. కాగా ప్రపంచవ్యాప్తంగా కోవిడ్‌-19 బారీన పడి 7వేలకు పైగా మృతి చెందగా, ప్రపంచవ్యాప్తంగా 1, 82,611 కరోనా కేసులు నమోదయ్యాయి.

క్వారంటైన్‌లో నువ్వు.. బయట నేను!

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top