భారత అభిమానులు ఆశించిన ఫైనల్ ఇది కాదు. అయితే మరో జట్టుకు మద్దతివ్వాలనుకుంటే మాత్రం అందరూ వెస్టిండీస్ వైపు మొగ్గు
సంజయ్ మంజ్రేకర్
భారత అభిమానులు ఆశించిన ఫైనల్ ఇది కాదు. అయితే మరో జట్టుకు మద్దతివ్వాలనుకుంటే మాత్రం అందరూ వెస్టిండీస్ వైపు మొగ్గు చూపుతారు. భారత్‌తో జరిగిన సెమీస్‌లో విండీస్ బలహీనమైన ప్రత్యర్థి. కానీ టాస్ గెలవడం, మైదానం పరిమాణం చిన్నగా ఉండటం కరీబియన్లకు కలిసొచ్చింది. వాంఖడేతో పోలిస్తే ఈడెన్ గార్డెన్స్ పరిస్థితి కాస్త భిన్నంగా ఉంటుంది. ఈ పిచ్‌పై చాలా అరుదుగా బౌన్స్ ఉంటుంది. బంతి ఊహించినంతగా బ్యాట్ మీదకు రాదు. వాస్తవానికి ఇక్కడ 7 గంటలకు మ్యాచ్ మొదలైతే... ముంబైలో 8 గంటలకు పరిస్థితులు ఎలా ఉంటాయో ఈడెన్‌లో అలా ఉంటాయి. కాబట్టి ముందుగా బ్యాటింగ్ చేసిన జట్టుకు అదనపు ప్రయోజనాలు ఉంటాయి. ఈడెన్ వికెట్ చూడటానికి బాగానే ఉంటుంది.
అయితే పూర్తిస్థాయిలో స్పిన్ వికెట్ కాకుండా ఓ మాదిరి టర్నింగ్ ఉండొచ్చని నా అంచనా. ఇక రెండో ఇన్నింగ్స్‌లో ఇది చాలా తక్కువగా ఉండొచ్చు. ఒకవేళ విండీస్ రెండో ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్ చేస్తే ఇంగ్లండ్ విజయాన్ని అడ్డుకునే అవకాశాలు ఉన్నాయి. ఓ వరాల్‌గా టాస్ మరోసారి కీలకంకానుంది. వెస్టిండీస్ టాస్ గెలిస్తే మాత్రం వాళ్లను ఓడించడం ఇంగ్లండ్‌కు శక్తికి మించిన పనే. అయితే ఎవరైనా నా తలకు గన్ పెట్టినా సరే ఇంగ్లండ్‌కే ఓటు వేస్తాను. ఎందుకంటే విండీస్‌తో పోలిస్తే ఆ జట్టే మెరుగ్గా ఉంది.