నేనంటే మా క్రికెటర్లకు అసూయ | England players jealous of me: Pietersen | Sakshi
Sakshi News home page

నేనంటే మా క్రికెటర్లకు అసూయ

Jan 10 2015 6:14 PM | Updated on Sep 2 2017 7:30 PM

నేనంటే మా క్రికెటర్లకు అసూయ

నేనంటే మా క్రికెటర్లకు అసూయ

ఇంగ్లండ్ క్రికెట్ జట్టు కెప్టెన్ కెవిన్ పీటర్సన్ మరోసారి తన సహచర క్రికెటర్లపై విమర్శలు ఎక్కుపెట్టాడు.

మెల్బోర్న్: ఇంగ్లండ్ క్రికెట్ జట్టు కెప్టెన్ కెవిన్ పీటర్సన్ మరోసారి తన సహచర క్రికెటర్లపై విమర్శలు ఎక్కుపెట్టాడు. తమ జట్టులోని ఆటగాళ్లకు తానంటే అసూయపడేవారని పీటర్సన్ అన్నాడు. సహచర ఆటగాళ్ల వల్ల తాను బలయ్యానని ఆరోపించాడు.

ఏడాది క్రితం వివాదాల కారణంగా అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకున్న పీటర్సన్.. సందర్భం వచ్చినప్పుడల్లా తన సహచరులపై విమర్శలు చేస్తూనే ఉన్నాడు. కెవిన్ తన ఆత్మకథలో పలు విషయాలను ప్రస్తావించాడు. తన కెరీర్లో జరిగిన పలు సంఘటనల గురించి అసంతృప్తి వ్యక్తం చేశాడు. ఆస్ట్రేలియాలో బిగ్బాష్ లీగ్ ఆరంభానికి ముందు ఓ ఇంటర్వ్యూలో కెవిన్ మాట్లాడుతూ.. ఇక్కడ అసూయ పడే ఆటగాళ్లు ఎవరూ లేరని అన్నాడు. అదే ఇంగ్లండ్లో అయితే అసూయ పడేవాళ్లకు కొదవేలేదని చెప్పాడు.

Advertisement
 
Advertisement
Advertisement