160 కోట్ల మంది చూశారు!

England One Day World Cup Match Watched By 160 Crore Peoples - Sakshi

వన్డే వరల్డ్‌ కప్‌ సూపర్‌ సక్సెస్‌   

దుబాయ్‌: సొంతగడ్డపై ఇంగ్లండ్‌ విజేతగా నిలిచిన ఇటీవలి వన్డే వరల్డ్‌ కప్‌ వీక్షకాభిమానంలో గత టోరీ్నల రికార్డును బద్దలు కొట్టింది. ప్రపంచ కప్‌ మ్యాచ్‌ల ప్రత్యక్ష ప్రసారాలను ప్రపంచవ్యాప్తంగా ఏకకాలంలో 160 కోట్ల మంది చూశారని అంతర్జాతీయ క్రికెట్‌ మండలి (ఐసీసీ) ప్రకటించింది. 2015 ప్రపంచ కప్‌తో పోలిస్తే ఇది 38 శాతం ఎక్కువ కావడం విశేషం. టీవీలతో పాటు డిజిటల్‌ వేదికపై ప్రజలు క్రికెట్‌ చూసేందుకు ఎక్కువ ఉత్సాహం చూపించారు. భారత్, పాకిస్తాన్‌ మధ్య జరిగిన మ్యాచ్‌ను గరిష్టంగా టీవీల్లోనే 27.3 కోట్ల మంది వీక్షించగా మరో 5 కోట్ల మంది డిజిటల్‌ వేదికపై చూశారు.   

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top