ఇంగ్లండ్‌ కెప్టెన్‌ మోర్గాన్‌కు గాయం

England expect Eoin Morgan to be fit for World Cup opener after finger fracture - Sakshi

లండన్‌: మరో ఐదు రోజుల్లో వన్డే వరల్డ్‌కప్‌ ఆరంభం కానున్న తరుణంలో ఇంగ్లండ్‌ కెప్టెన్‌ ఇయాన్‌ మోర్గాన్‌ గాయపడ్డాడు. శనివారం ఆస్ట్రేలియాతో జరుగనున్న వార్మప్‌ మ్యాచ్‌ కోసం ప్రాక్టీస్‌ చేస్తుండగా మోర్గాన్‌ చూపుడు వేలుకు గాయమైంది. దాంతో ఆసీస్‌ ప్రాక్టీస్‌ మ్యాచ్‌కు మోర్గాన్‌ దూరం కానున్నాడు. కాగా, మోర్గాన్‌ అయిన గాయం చిన్నపాటిదే కావడంతో తొలి మ్యాచ్‌ నాటికి అతను అందుబాటులోకి వస్తాడని ఇంగ్లండ్‌ యాజమాన్యం స్పష్టం చేసింది.

ఎడమ చూపుడు వేలికి గాయం కావడంతో ముందుజాగ్రత్తగా ఎక్స్‌రే తీయించామని, ఆ గాయం చిన్నదేనని ఎక్స్‌రేలో తేలడంతో ఇంగ్లండ్‌ జట్టు ఊపిరి పీల్చుకుంది. తమ తొలి మ్యాచ్‌లో దక్షిణాఫ్రికాతో ఇంగ్లండ్‌ తలపడనుంది. మే30 (గురువారం)వ తేదీన ఇరు జట్ల మధ్య ఓవల్‌ వేదికగా జరుగనున్న మ్యాచ్‌తో వరల్డ్‌కప్‌ సమరం ఆరంభం కానుంది.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top