ఇంగ్లండ్ 400 ఆలౌట్ | england bowled out at 400 runs | Sakshi
Sakshi News home page

ఇంగ్లండ్ 400 ఆలౌట్

Dec 9 2016 12:44 PM | Updated on Sep 4 2017 10:18 PM

ఇంగ్లండ్ 400 ఆలౌట్

ఇంగ్లండ్ 400 ఆలౌట్

భారత్తో ఇక్కడ జరుగుతున్న నాల్గో టెస్టులో ఇంగ్లండ్ తన తొలి ఇన్నింగ్స్లో 400 పరుగులకు ఆలౌటైంది.

ముంబై: భారత్తో ఇక్కడ జరుగుతున్న నాల్గో టెస్టులో ఇంగ్లండ్ తన తొలి ఇన్నింగ్స్లో 400 పరుగులకు ఆలౌటైంది. 288/5 ఓవర్ నైట్ స్కోరుతో శుక్రవారం తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన ఇంగ్లండ్ మరో 112 పరుగులు జత చేసింది. ఓవర్ నైట్ ఆటగాడు బెన్ స్టోక్స్(31)ను తొందరగానే పెవిలియన్ కు పంపినా, మరో ఓవర్ నైట్ ఆటగాడు జాస్ బట్లర్(76) చివరి వికెట్గా అవుటయ్యాడు. ప్రతీ ఆటగాడితో ఎంతో కొంత భాగస్వామ్యం నెలకొల్పతూ జట్టు స్కోరును ముందుకు తీసుకెళ్లాడు.

 

ప్రధానంగా జాక్ బాల్(31)తో కలిసి 54 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేశాడు.  ఈ క్రమంలోనే బట్లర్ హాఫ్ సెంచరీ సాధించాడు. అయితే లంచ్ తరువాత బట్లర్ స్వేచ్ఛగా బ్యాట్ ఝుళిపించడంతో ఇంగ్లండ్ నాల్గొందల మార్కును చేరింది. కాగా, జడేజా బౌలింగ్లో భారీ షాట్ కు యత్నించిన బట్లర్ బౌల్డ్ అయ్యాడు. దాంతో ఇంగ్లండ్ ఇన్నింగ్స్ ముగిసింది. భారత బౌలర్లలో అశ్విన్ ఆరు వికెట్లు సాధించగా, జడేజా నాలుగు వికెట్లు తీశాడు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement