సోమ్‌దేవ్ సంచలనం | Dubai Open: Somdev Devvarman upsets Juan Martin del Potro to enter second round | Sakshi
Sakshi News home page

సోమ్‌దేవ్ సంచలనం

Feb 26 2014 1:08 AM | Updated on Sep 2 2017 4:05 AM

సోమ్‌దేవ్ సంచలనం

సోమ్‌దేవ్ సంచలనం

భారత టెన్నిస్ స్టార్ సోమ్‌దేవ్ దేవ్‌వర్మన్ తన కెరీర్‌లోనే చిరస్మరణీయ విజయం సాధించాడు.

ఐదో ర్యాంకర్ డెల్‌పొట్రోపై విజయం
 దుబాయ్ ఓపెన్
 
 దుబాయ్: భారత టెన్నిస్ స్టార్ సోమ్‌దేవ్ దేవ్‌వర్మన్ తన కెరీర్‌లోనే చిరస్మరణీయ విజయం సాధించాడు. తొలిసారి ప్రపంచ టాప్-5 ర్యాంకింగ్స్‌లో ఉన్న క్రీడాకారుడిపై గెలిచాడు. దుబాయ్ ఓపెన్ టోర్నీ తొలి రౌండ్‌లో ప్రపంచ 78వ ర్యాంకర్ సోమ్‌దేవ్ 7-6 (7/3)తో ప్రపంచ ఐదో ర్యాంకర్, రెండో సీడ్, యూఎస్ ఓపెన్ మాజీ చాంపియన్ యువాన్ మార్టిన్ డెల్‌పొట్రో (అర్జెంటీనా)పై గెలిచాడు.
 
  తొలి సెట్‌ను కోల్పోయాక గాయం కారణంగా డెల్‌పొట్రో వైదొలగడంతో సోమ్‌దేవ్‌ను విజేతగా ప్రకటించారు. 67 నిమిషాలపాటు జరిగిన తొలి సెట్‌లో సోమ్‌దేవ్ ఐదు ఏస్‌లు సంధించాడు. ఇద్దరూ ఒక్కోసారి తమ సర్వీస్‌ను కోల్పోయారు. అయితే స్కోరు 5-6తో ఉన్నదశలో సోమ్‌దేవ్ తన సర్వీస్‌లో 0-40తో వెనుకబడ్డా  తేరుకొని మూడు సెట్ పాయింట్లు కాపాడుకున్నాడు. సర్వీస్‌ను నిలబెట్టుకొని స్కోరును సమం చేశాడు. టైబ్రేక్‌లో పైచేయి సాధించి తొలి సెట్‌ను నెగ్గాడు.
 
 క్వార్టర్స్‌లో బోపన్న జంట
 పురుషుల డబుల్స్‌లో బోపన్న (భారత్)- ఖురేషీ (పాకిస్థాన్) జోడి క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించింది. తొలి రౌండ్‌లో ఈ ఇండో-పాక్ ద్వయం 6-1, 5-7, 10-8తో  డెవిడెంకో (రష్యా)- హనెస్కూ (రుమేనియా) పై నెగ్గింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement