హారిక తొలి గేమ్‌ ‘డ్రా’ | dronavalli Harika draw her game in Knockout chess championship | Sakshi
Sakshi News home page

హారిక తొలి గేమ్‌ ‘డ్రా’

Feb 12 2017 12:09 AM | Updated on Sep 5 2017 3:28 AM

హారిక తొలి గేమ్‌ ‘డ్రా’

హారిక తొలి గేమ్‌ ‘డ్రా’

ప్రపంచ మహిళల నాకౌట్‌ చెస్‌ చాంపియన్‌షిప్‌లో ఆంధ్రప్రదేశ్‌ గ్రాండ్‌మాస్టర్‌ ద్రోణవల్లి హారిక తొలి రౌండ్‌లో తొలి గేమ్‌ను ‘డ్రా’గా ముగించింది.

ప్రపంచ మహిళల నాకౌట్‌ చెస్‌ చాంపియన్‌షిప్‌లో ఆంధ్రప్రదేశ్‌ గ్రాండ్‌మాస్టర్‌ ద్రోణవల్లి హారిక తొలి రౌండ్‌లో తొలి గేమ్‌ను ‘డ్రా’గా ముగించింది. ఇరాన్‌లోని టెహరాన్‌లో శనివారం ఈ మెగా ఈవెంట్‌ ప్రారంభమైంది.

బంగ్లాదేశ్‌ క్రీడాకారిణి షమీమా అక్తర్‌ లీజాతో జరిగిన తొలి రౌండ్‌ తొలి గేమ్‌లో నల్లపావులతో ఆడిన హారిక 85 ఎత్తుల్లో ‘డ్రా’ చేసుకుంది. మరోవైపు ఎలీనా (అర్మేనియా)తో జరిగిన తొలి గేమ్‌ను భారత్‌కే చెందిన పద్మిని రౌత్‌ 57 ఎత్తుల్లో ‘డ్రా’గా ముగించింది.

Advertisement
 
Advertisement
Advertisement