‘డ్రా’ దిశగా రెండో టెస్టు | Draw' to the second Test | Sakshi
Sakshi News home page

‘డ్రా’ దిశగా రెండో టెస్టు

Sep 5 2013 1:31 AM | Updated on Sep 1 2017 10:26 PM

‘డ్రా’ దిశగా రెండో టెస్టు

‘డ్రా’ దిశగా రెండో టెస్టు

భారత్ ‘ఎ’, న్యూజిలాండ్ ‘ఎ’ మధ్య జరుగుతున్న రెండో అనధికారిక టెస్టు డ్రా దిశగా సాగుతోంది. భారత బ్యాట్స్‌మన్ మన్‌ప్రీత్ జునేజా (336 బంతుల్లో 178 బ్యాటింగ్; 19 ఫోర్లు, 1 సిక్స్) అద్భుత సెంచరీతో జట్టు ఇన్నింగ్స్‌ను నిలబెట్టాడు.

సాక్షి, విశాఖపట్నం: భారత్ ‘ఎ’, న్యూజిలాండ్ ‘ఎ’ మధ్య జరుగుతున్న రెండో అనధికారిక టెస్టు డ్రా దిశగా సాగుతోంది. భారత బ్యాట్స్‌మన్ మన్‌ప్రీత్ జునేజా (336 బంతుల్లో 178 బ్యాటింగ్; 19 ఫోర్లు, 1 సిక్స్) అద్భుత సెంచరీతో జట్టు ఇన్నింగ్స్‌ను నిలబెట్టాడు.
 
  అతనికి జగదీశ్ (200 బంతుల్లో 91; 9 ఫోర్లు), అభిషేక్ నాయర్ (55 బంతుల్లో 57; 8 ఫోర్లు, 1 సిక్స్) అండగా నిలిచారు. ఫలితంగా బుధవారం మూడో రోజు ఆట ముగిసే సరికి భారత్ ‘ఎ’ తమ తొలి ఇన్నింగ్స్‌లో 124 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 408 పరుగులు చేసింది. జునేజాతో పాటు ధావల్ కులకర్ణి (4) క్రీజ్‌లో ఉన్నాడు. మూడు వికెట్లు చేతిలో ఉన్న భారత్ ప్రస్తుతం మరో 29 పరుగులు మాత్రమే వెనుకబడి ఉంది. గురువారం మ్యాచ్‌కు ఆఖరి రోజు.

Advertisement
 
Advertisement
Advertisement