పాకిస్తాన్‌ గెలిస్తేనే..!

Do or die clash for Pakistan Against South Africa - Sakshi

లండన్‌: వరల్డ్‌కప్‌లో పాకిస్తాన్‌, దక్షిణాఫ్రికా జట్లు ఫ్యాన్స్‌ అంచనాలను అందుకోవడంలో దారుణంగా విఫలమయ్యాయి. సఫారీలు ఆరు మ్యాచ్‌ల్లో నాలుగు ఓడి.. ఒకటి గెలిచారు. వర్షం కారణంగా ఒక మ్యాచ్‌ రద్దుకావడంతో కేవలం 3 పాయింట్లతో ఎనిమిదో స్థానంలో ఉన్నారు. పాక్‌ ఐదు మ్యాచ్‌ల్లో మూడు ఓడగా.. ఒకటి గెలిచింది. వర్షం కారణంగా ఒక మ్యాచ్‌ రద్దయింది. దీంతో ప్రస్తుతం 3 పాయింట్లతో ఆ జట్టు తొమ్మిదో స్థానంలో ఉంది. ఈ నేపథ్యంలో ఆదివారం దక్షిణాఫ్రికాతో జరుగనున్న మ్యాచ్‌ పాక్‌ చావో రేవో తేల్చుకోవడానికి సిద్ధమైంది.

గత మ్యాచ్‌లో పాక్‌ చిరకాల ప్రత్యర్థి భారత్‌ చేతిలో చిత్తుగా ఓడింది. ఆ ఓటమి బాధ నుంచి కోలుకుని సఫారీలపై నెగ్గాలని సర్ఫరాజ్‌ సేన పట్టుదలగా ఉంది. ఇమామ్‌ ఉల్‌ హక్‌, ఫఖర్‌ జమాన్‌, బాబర్‌ ఆజమ్‌, కెప్టెన్‌ సర్ఫరాజ్‌తో బ్యాటింగ్‌ విభాగం పటిష్ఠంగా ఉంది. మహ్మద్‌ ఆమిర్‌, హసన్‌ అలీ, వాహబ్‌ రియాజ్‌ బౌలింగ్‌ విభాగానికి నేతృత్వం వహించనున్నారు. మరోవైపు దక్షిణాఫ్రికా కూడా గత మ్యాచ్‌ల్లో న్యూజిలాండ్‌ చేతిలో పోరాడి ఓడింది. ఈ మ్యాచ్‌లోనూ సమష్ఠి ప్రదర్శనతో గెలవాలని మేనేజ్‌మెంట్‌ ఆశిస్తోంది. సఫారీలకు సెమీస్‌ చేరే అవకాశాలు దాదాపు లేకపోయినప్పటికీ విజయాల బాటపట్టాలని యోచిస్తోంది. హషీమ్‌ ఆమ్లా, క్వింటన్‌ డికాక్‌, కెప్టెన్‌ డుప్లెసి బ్యాటింగ్‌కు పెద్ద దిక్కుగా ఉన్నారు. రబాడ, లుంగిడి ఎన్‌గిడి, క్రిస్‌ మోరిస్‌, ఇమ్రాన్‌ తాహిర్‌తో బౌలింగ్‌ విభాగం పటిష్ఠంగా ఉంది.  ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన పాకిస్తాన్‌ తొలుత బ్యాటింగ్‌ ఎంచుకుంది. టాస్‌ గెలిచిన పాక్‌ సర్ఫరాజ్‌ అహ్మద్‌ మరో మాట లేకుండా ముందుగా బ్యాటింగ్‌ చేసేందుకు మొగ్గుచూపాడు.

తుది జట్లు

పాకిస్తాన్‌
సర్పరాజ్‌ అహ్మద్‌(కెప్టెన్‌), ఇమాముల్‌ హక్‌, ఫకార్‌ జమాన్‌, బాబర్‌ అజామ్‌, మహ్మద్‌ హఫీజ్‌, హరీస్‌ సోహైల్‌, ఇమాద్‌ వసీం, షాదబ్‌ ఖాన్‌, వహాబ్‌ రియాజ్‌, షాహిన్‌ అఫ్రిది, మహ్మద్‌ అమిర్‌

దక్షిణాఫ్రికా
డుప్లెసిస్‌(కెప్టెన్‌), డీకాక్‌, హషీమ్‌ ఆమ్లా, మర్కరమ్‌, వాన్‌ డెర్‌ డస్సెన్‌, డేవిడ్‌ మిల్లర్‌, ఫెహ్లుక్వోయో, క్రిస్‌ మోరిస్‌, రబడా, లుంగి ఎన్‌గిడి, ఇమ్రాన్‌ తాహీర్‌


 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top