వింబుల్డన్‌లో జొకోవిచ్‌కు టాప్ సీడింగ్ | Djokovic Wimbledon top seeding | Sakshi
Sakshi News home page

వింబుల్డన్‌లో జొకోవిచ్‌కు టాప్ సీడింగ్

Jun 23 2016 12:24 AM | Updated on Sep 4 2017 3:08 AM

వింబుల్డన్‌లో జొకోవిచ్‌కు టాప్ సీడింగ్

వింబుల్డన్‌లో జొకోవిచ్‌కు టాప్ సీడింగ్

అరుదైన ‘క్యాలెండర్ గ్రాండ్‌స్లామ్’ ఘనతపై కన్నేసిన ప్రపంచ నంబర్‌వన్ నొవాక్ జొకోవిచ్ (సెర్బియా)కు వింబుల్డన్ టెన్నిస్....

లండన్: అరుదైన ‘క్యాలెండర్ గ్రాండ్‌స్లామ్’ ఘనతపై కన్నేసిన ప్రపంచ నంబర్‌వన్ నొవాక్ జొకోవిచ్ (సెర్బియా)కు వింబుల్డన్ టెన్నిస్ టోర్నమెంట్‌లో టాప్ సీడింగ్ లభించింది. ఈనెల 27 నుంచి జూలై 10 వరకు జరిగే ఈ సీజన్ మూడో గ్రాండ్‌స్లామ్ టోర్నీకి సంబంధించి సీడింగ్స్ వివరాలను బుధవారం ప్రకటించారు. మాజీ చాంపియన్ ఆండీ ముర్రే (బ్రిటన్)కు రెండో సీడింగ్‌ను కేటాయించారు.

ఫలితంగా ఈ ఇద్దరు ఫైనల్లో మాత్రమే తలపడే అవకాశముంది. ఏడుసార్లు చాంపియన్ ఫెడరర్ (స్విట్జర్లాండ్)కు మూడో సీడ్ దక్కగా... వావ్రింకా (స్విట్జర్లాండ్)కు నాలుగో సీడ్ లభించింది. మహిళల సింగిల్స్ విభాగంలో ప్రపంచ నంబర్‌వన్ సెరెనా విలియమ్స్ (అమెరికా)కు టాప్ సీడింగ్ దక్కగా... ఫ్రెంచ్ ఓపెన్ చాంపియన్ ముగురుజా (స్పెయిన్)కు రెండో సీడ్‌ను కేటాయించారు.

Advertisement
 
Advertisement
Advertisement