జొకోవిచ్‌ ‘నెగిటివ్‌’  | Djokovic And His Wife Tested Negative Of Coronavirus | Sakshi
Sakshi News home page

జొకోవిచ్‌ ‘నెగిటివ్‌’ 

Jul 3 2020 12:15 AM | Updated on Jul 3 2020 12:15 AM

Djokovic And His Wife Tested Negative Of Coronavirus - Sakshi

బెల్‌గ్రేడ్‌: ఇటీవలే కరోనా బారిన పడిన ప్రపంచ నంబర్‌వన్‌ టెన్నిస్‌ ప్లేయర్‌ నొవాక్‌ జొకోవిచ్‌ కోలుకున్నాడు. జొకోవిచ్‌తో పాటు అతని భార్య జెలీనా కూడా తాజా పరీక్షల్లో ‘నెగెటివ్‌’గా తేలారు. ఈ విషయాన్ని అతని మీడియా బృందం గురువారం ప్రకటించింది. ‘బెల్‌గ్రేడ్‌లో వీరిద్దరికీ పీసీఆర్‌ పరీక్ష నిర్వహించగా కోవిడ్‌–19 ఫలితం నెగెటివ్‌గా వచ్చింది’ అని ఓ ప్రకటనలో పేర్కొంది. ఓవైపు కరోనా వ్యాప్తి తీవ్రంగా ఉన్నప్పటికీ ఎగ్జిబిషన్‌ టోర్నీలు నిర్వహించి జొకో విమర్శలపాలయ్యాడు. సరైన జాగ్రత్త చర్యలు లేకుండా, సామాజిక దూరం పాటించకుండా జొకోవిచ్‌  ఆధ్వర్యంలో సెర్బియా, క్రొయేషియాలలో జరిగిన ఎగ్జిబిషన్‌ మ్యాచ్‌ల్లో పాల్గొన్న పలువురు క్రీడాకారులు కోవిడ్‌–19 బారిన పడ్డారు. కరోనా వచ్చినట్లు నిర్ధారణ కావడంతో స్వీయ నిర్బంధంలోకి వెళ్లిన జొకోవిచ్‌ జంట పది రోజుల తర్వాత నిర్వహించిన తాజా పరీక్షల్లో నెగెటివ్‌గా బయటపడ్డారు.

Advertisement
 
Advertisement
Advertisement