:ఆస్ట్రేలియా ఓపెన్ లో ప్రపంచ నంబర్ వన్ ఆటగాడు, డిఫెండింగ్ చాంపియన్ నొవాక్ జొకోవిచ్ నాల్గో రౌండ్ లోకి ప్రవేశించాడు.
మెల్బోర్న్:ఆస్ట్రేలియా ఓపెన్ లో ప్రపంచ నంబర్ వన్ ఆటగాడు, డిఫెండింగ్ చాంపియన్ నొవాక్ జొకోవిచ్ నాల్గో రౌండ్ లోకి ప్రవేశించాడు. శుక్రవారం జరిగిన మూడో రౌండ్ పోరులో జొకోవిచ్ 6-1, 7-5, 7-6(6) తేడాతో అండ్రియాస్ సెప్పి(ఇటలీ)పై పోరాడి గెలిచాడు. రెండు గంటల 21 నిమిషాల పాటు జరిగిన మ్యాచ్ లో జొకోవిచ్ విజయం సాధించాడు.
తొలి గేమ్ ను అవలీలగా గెలిచిన జొకోవిచ్.. ఆ తరువాత జరిగిన రెండు సెట్లలో సెప్పి నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదురైంది. రెండో సెట్ లో కష్టపడి గెలిచిన జొకోవిచ్.. నిర్ణయాత్మక మూడో సెట్ లో మాత్రం టై బ్రేక్ లో విజయం సాధించాడు. దీంతో ముఖాముఖి పోరులో తన విజయాలను సంఖ్యను జొకోవిచ్ 12కు పెంచుకున్నాడు. అంతకుముందు ఈ ఇద్దరి మధ్య 11 గేమ్ లు జరగ్గా అన్నింటా జొకోవిచ్ విజయం సాధించడం విశేషం. జొకోవిచ్ తన తదుపరి పోరులో ఫ్రెంచ్ ఆటగాడు సిమోన్ తో తలపడనున్నాడు.