బోపన్న జోడీ ఓటమి  | Divij Sharan and Rohan Bopanna exit ATP Paris Masters | Sakshi
Sakshi News home page

బోపన్న జోడీ ఓటమి 

Nov 2 2018 2:10 AM | Updated on Nov 2 2018 2:10 AM

 Divij Sharan and Rohan Bopanna exit ATP Paris Masters - Sakshi

పారిస్‌: ఏటీపీ మాస్టర్స్‌ టోర్నీ పారిస్‌ ఓపెన్‌ డబుల్స్‌ విభాగంలో భారత ఆటగాళ్లు రోహన్‌ బోపన్న, దివిజ్‌ శరణ్‌లకు నిరాశ ఎదురైంది. గురువారం జరిగిన పురుషుల డబుల్స్‌ ప్రిక్వార్టర్స్‌లో రోహన్‌ బోపన్న–రోజర్‌ వాసెలిన్‌ (ఫ్రాన్స్‌) జోడీ 6–7, 3–6 తో ఒలివర్‌ (ఆస్ట్రియా)–మాట్‌ పావిక్‌ (క్రొయేషియా) జంట చేతి లో ఓడింది. దివిజ్‌ శరణ్‌–అర్తెమ్‌ సితాక్‌ (న్యూజిలాండ్‌) ద్వయం 4–6, 3–6తో మైక్‌ బ్రయన్‌–జాక్‌ సోక్‌ (అమెరికా) చేతిలో ఓడింది.  

సెమీస్‌లో సాకేత్‌ జోడి... 
మరోవైపు షెన్‌జెన్‌ ఓపెన్‌ ఏటీపీ చాలెంజర్‌ టెన్నిస్‌ టోర్నమెంట్‌లో హైదరాబాద్‌ ప్లేయర్‌ సాకేత్‌ మైనేని–రామ్‌కుమార్‌ రామనాథన్‌ జోడీ సెమీ ఫైనల్‌ చేరింది. చైనాలో జరుగుతోన్న ఈ టోర్నీ పురుషుల డబుల్స్‌ క్వార్టర్‌ ఫైనల్లో సాకేత్‌–రామ్‌కుమార్‌ జోడీ 6–4, 6–3తో రిగలె టి–డీ వూ (చైనా) జంటపై గెలిచి సెమీస్‌కు అర్హత సాధించింది. మరో క్వార్టర్స్‌లో అర్జున్‌ కడే (భారత్‌)–సంచయ్‌ రతివతన (థాయ్‌లాండ్‌) ద్వయం 6–7, 7–5, 10–2తో యిన్‌ పెంగ్‌ (తైవాన్‌) సోంచట్‌ రతివతన (థాయ్‌లాండ్‌) జంటపై గెలిచి సెమీస్‌కు అర్హత సాధించింది. 

Advertisement
 
Advertisement
Advertisement