సీమా పూనియా అవుట్ | Discus Throw player seema punia crashes out of rio olympics | Sakshi
Sakshi News home page

సీమా పూనియా అవుట్

Aug 16 2016 11:24 AM | Updated on Sep 4 2017 9:31 AM

సీమా పూనియా అవుట్

సీమా పూనియా అవుట్

రియో ఒలింపిక్స్ లో భారత డిస్కస్క త్రో క్రీడాకారిణి సీమా పూనియా నిరాశపరిచింది.

రియో డీ జనీరో:రియో ఒలింపిక్స్ లో భారత డిస్కస్క త్రో క్రీడాకారిణి సీమా పూనియా నిరాశపరిచింది. గ్రూప్-బిలో జరిగిన డిస్కస్ త్రో క్వాలిఫయింగ్ రౌండ్లో పూనియా ఫైనల్ కు అర్హత సాధించడంలో వైఫల్యం చెందింది. తొలి ప్రయత్నంలో 57.58 మీటర్లు డిస్క్ విసిరిన సీమా..  ఆ తరువాత ప్రయత్నాలో ఘోరంగా విఫలమై 20వ స్థానానికి పరిమితమైంది.

 

డిస్కస్ త్రో పాల్గొనే వారిని రెండు గ్రూపులుగా విభజించారు. ఒకో గ్రూపులో 17 మంది క్రీడాకారిణులు పాల్గొనగా, ఫైనల్కు మాత్రం రెండు గ్రూపుల్లో కలిపి 12 మంది మాత్రమే అర్హత సాధిస్తారు.  దీంతో డిస్కస్ త్రో ఈవెంట్లో ఫైనల్ కు చేరాలన్న సీమా ఆశలు తీరలేదు. కాగా, క్యూబీ క్రీడాకారిణి యెమీ పెరెజ్ 65. 38 మీటర్లు డిస్క్ విసిరి అగ్రస్థానంలో నిలిచింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement