breaking news
Seema Punia
-
Tokyo Olympics: మహిళల 100 మీ. విభాగం.. ప్రపంచ రికార్డు
Tokyo Olympics 2020: మహిళల 100 మీటర్ల విభాగంలో స్ప్రింటర్ ఎలైన్ థామ్సన్‌కు స్వర్ణం దక్కింది. 10.61 సెకన్లలో లక్ష్యాన్ని పూర్తిచేసిన ఆమె ప్రపంచ రికార్డు నెలకొల్పింది. క్వార్టర్ ఫైనల్లోకి భారత మహిళల హాకీ జట్టు టోక్యో ఒలింపిక్స్ లో భారత మహిళల హాకీ జట్టు క్వార్టర్ ఫైనల్లోకి అడుగుపెట్టింది. బ్రిటన్ జట్టు ఐర్లాండ్ ను 2-0 గోల్స్ తేడాతో ఓడించడంతో భారత్ క్వార్టర్ ఫైనల్లో ఆడే అవకాశం దక్కింది. 41 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత మహిళల హాకీ జట్టు క్వార్టర్స కు చేరుకుంది. ఒలింపిక్స్ క్రీడలు మొదలైనప్పటి నుంచి ఇది మూడోసారి మాత్రమే. రేసులో నిలవాలంటే తప్పక నెగ్గాల్సిన మ్యాచ్ లో దక్షిణాఫ్రికా పై 4-3తేడాతో విజయం సాధించిన విషయం తెలిసిందే. పోరాడి ఓడిన సింధు సెమీ ఫైనల్లో తెలుగు తేజం పీవీ సింధు పోరాటం ముగిసింది. చైనీస్ తైపీకి చెందిన తైజుయింగ్ చేతిలో పరాజయం పాలైంది. తొలి గేమ్‌లో 18-21, రెండో గేమ్‌లో 12-21 తేడాతో తైజు చేతిలో ఓడిపోయింది. రెండో గేమ్‌లోనూ వెనుకంజ సెమీస్‌లో తొలి గేమ్ ఓడిన పీవీ సింధు రెండో గేమ్‌లోనూ వెనుకబడి ఉంది. తైజు 20-12తో ముందంజలో నిలిచింది. సింధుపై ఒత్తిడి పెంచుతూ తైజు అటాకింగ్ కొనసాగిస్తోంది. తొలి గేమ్ ఓడిపోయిన పీవీ సింధు సెమీ ఫైనల్లో వరల్డ్ నెంబర్ వన్ తైజుయింగ్ సత్తా చాటుతోంది. తొలి గేమ్‌లో 21-18తో పీవీ సింధును ఓడించింది. హోరాహోరీగా పీవీ సింధు- తైజు సమరం బ్యాడ్మింటన్ మహిళల సింగిల్స్ సెమీస్‌లో పీవీ సింధు- తైజుయింగ్ మధ్య పోరు నువ్వా- నేనా అన్నట్లుగా సాగుతోంది. తొలి గేమ్‌లో ఆధిక్యం దిశగా సింధు దూసుకుపోయినప్పటికీ.. తైజు సైతం గట్టి పోటీనిస్తోంది. క్వార్టర్ ఫైనల్లో బాక్సర్ పూజారాణి ఓటమి టోక్యో ఒలింపిక్స్ లో బాక్సర్ పూజారాణి పోరాటం ముగిసింది. మహిళల (69-75 కేజీలు) విభాగంలో క్వార్టర్ ఫైనల్లో చైనాకు చెందిన క్వియాన్ లీ చేతిలో పూజారాణి ఓటమి పాలయ్యింది. సెమీస్ మ్యాచ్ 1 లో గెలిచి ఫైనల్ చేరిన చైనా షట్లర్ చెన్ యు ఫెయ్.. టోక్యో ఒలింపిక్స్ మహిళల సింగిల్స్ సెమీ ఫైనల్ -2లో చైనా షట్లర్ చెన్ యు ఫెయ్, బింగ్జియావో పై విజయం సాధించి ఫైనల్లో అడుగు పెట్టింది. హోరాహోరీగా ఈ మ్యాచ్ లో ఫస్ట్ గేమ్‌లో చెన్ యూ ఫెయ్ 21-16తో విజయం సాధించగా, రెండో మ్యాచ్‌లో బింగ్జియావో13-21 తో విజయం సాధించింది.దీంతో మూడో మ్యాచ్‌లో చైనా షట్లర్ చెన్ యు ఫెయ్ విజయం సాధించింది మొదటి రౌండ్లో ఓడిన భారత బాక్సర్ పూజా రాణి టోక్యో ఒలింపిక్స్ లో మహిళల మిడిల్ వెయిట్ (75 కేజీలు) క్వార్టర్ ఫైనల్లో చైనాకు చెందిన క్వియాన్ లీతో భారత పూజా రాణి మొదటి రౌండ్ 0-5తో ఓడిపోయింది. టోక్యో: బ్యాడ్మింటన్ మహిళల సింగిల్స్ సెమీ ఫైనల్(2) కాస్త ఆలస్యంగా ప్రారంభం కానుంది. తొలి సెమీస్ ముగిసిన తర్వాతే పీవీ సింధు- తైజుయింగ్ పోరుకు రంగం సిద్ధం కానుంది. కాసేపట్లో తైజుయింగ్‌తో తలపడనున్న పీవీ సింధు టోక్యో ఒలింపిక్స్ బ్యాడ్మింటన్ మహిళల సింగిల్స్ సెమీఫైనల్లో ప్రపంచ నెంబర్ వన్ తైజుయింగ్‌తో సింధు మరికాసెపట్లో తలపడునుంది. రియో ఒలింపిక్స్‌లో రజతం సాధించి విశ్వ యవనికపై భారత పతకాన్ని రెపరెపలాడించిన సింధు టోక్యోలోనూ సత్తా చాటుతోంది. తాజా ఒలింపిక్స్‌లో వరుస విజయాలతో దూసుకెళ్తున్న సింధు పతకానికి రెండడుగుల దూరంలో ఉంది. సింధు, తైజుయింగ్ మ్యాచ్‌పై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. (చదవండి: Tokyo Olympics 2020: భారత్ గెలిచే పతకాల సంఖ్య ఎంత అనుకుంటున్నారు..) 50 మీ రైఫిల్ విభాగంలో భారత షూటర్లకు నిరాశ ►టోక్యో ఒలింపిక్స్‌లో భారత షూటర్లు మరోసారి నిరాశపరిచారు. మహిళల 50 మీటర్ల రైఫిల్ 3 పొజిషన్స్ ఈవెంట్లో అంజుమ్ ముద్గిల్, తేజస్విని సావంత్‌లు ఫైనల్‌కు అర్హత సాధించలేకపోయారు. 2018 కామన్వెల్త్ గేమ్స్‌లో సిల్వర్ మెడల్ సాధించిన అంజుమ్. ఇవాళ జరిగిన ఈవెంట్లో క్వాలిఫయింగ్ రౌండ్లో 15వ స్థానంలో నిలిచింది. ఆమె 1167 స్కోర్ చేసింది. మరో షూటర్ తేజస్విని 1154 స్కోర్‌తో 33వ స్థానంలో నిలిచింది. అయితే కేవలం టాప్ 8 మంది షూటర్లు మాత్రమే ఈ ఈవెంట్లో ఫైనల్‌కు అర్హత సాధిస్తారు. యుసియా జికోవా ఒలింపిక్ రికార్డు క్రియేట్ చేసింది. 1182 స్కోర్ చేసి ఆమె ఫస్ట్ ప్లేస్‌లో నిలిచింది. భారత మహిళల హాకీ జట్టుకు మరో విజయం ►టోక్యో ఒలింపిక్స్‌లో మహిళల హాకీ మ్యాచ్‌లో భాగంగా దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో భారత్ మహిళల జట్టు విజయాన్ని అందుకుంది. చివరివరకు నువ్వా నేనా అన్నట్లు సాగిన మ్యాచ్‌లో భారత్ 4-3 తేడాతో గెలిచి క్వార్టర్స్ రేసులో నిలిచింది. భారత్ తరపున ఆట 4,17, 49వ నిమిషంలో వందన కటారియా, 32 నిమిషంలో నేహా గోల్స్ చేయగా.. దక్షిణాఫ్రికా తరపున మారియా, హంటర్, టీసీ గ్లాస్బీలు గోల్స్ చేశారు. ప్రస్తుతం క్వార్టర్స్ రేసులో ఉన్న భారత్ .. బ్రిటన్, ఐర్లాండ్ మధ్య జరగనున్న మ్యాచ్‌లో ఐర్లాండ్ ఓడిపోయినా లేక మ్యాచ్‌ను డ్రా చేసుకున్నా భారత్‌కు క్వార్టర్స్ అవకాశం ఉంటుంది. డిస్కస్ త్రో ఫైనల్లో కమల్‌ప్రీత్ కౌర్ ►టోక్యో ఒలింపిక్స్‌లో డిస్కస్ త్రో విభాగంలో కమల్‌ప్రీత్ కౌర్ సంచలనం సృష్టించింది. డిస్కస్ త్రో విభాగంలో 64 మీటర్ల దూరం విసిరితే ఫైనల్‌కు అర్హత సాధిస్తారు. కాగా కమల్‌ప్రీత్ మూడో ప్రయత్నంలో సరిగ్గా 64 మీ విసిరి ఫైనల్‌కు నేరుగా అర్హత సాధించింది. మొత్తం మూడు రౌండ్లపాటు జరిగిన డిస్కస్‌త్రోలో కమల్‌ప్రీత్ తొలి రౌండ్లో 60.29, రెండో రౌండ్లో 63.97, మూడో రౌండ్లో 64 మీ విసరడం విశేషం. ఇక ఈ ఈవెంట్లోనే గ్రూప్-ఏలో పార్టిసిపేట్ చేసిన మరో ఇండియన్ డిస్కస్ త్రోయర్ సీమా పూనియా 60.57 మీటర్ల దూరమే విసిరి ఫైనల్‌కు క్వాలిఫై కాలేకపోయింది. మొత్తంగా సీమా పూనియా16వ స్థానంలో నిలిచింది. #TeamIndia | #Tokyo2020 | #Athletics Women's Discus Throw Qualification Results A superb 6⃣4⃣m throw by #KamalpreetKaur to qualify for the Finals in Group B, while #SeemaPunia bows out, finishing 6th in Group A! #RukengeNahi #EkIndiaTeamIndia #Cheer4India pic.twitter.com/7ZwoeX8rWy — Team India (@WeAreTeamIndia) July 31, 2021 ప్రీక్వార్టర్స్‌లో అమిత్ పంగల్ ఓటమి ►ఇండియాకు బాక్సింగ్‌లో కచ్చితంగా మెడల్ తీసుకొస్తాడనుకున్న బాక్సర్ అమిత్ పంగాల్‌కు షాక్ తగిలింది. అతడు ప్రిక్వార్టర్స్‌లోనే ఇంటిదారి పట్టాడు. కొలంబియా బాక్సర్ మార్టినెజ్ రివాస్‌తో జరిగిన ప్రిక్వార్టర్స్ బౌట్లో1-4 తేడాతో అమిత్ పరాజయం పాలయ్యాడు. 48-52 కేజీల ఫ్లైవెయిట్ కేటగిరీలో టాప్ సీడ్‌గా బరిలోకి దిగిన అమిత్.. ఈసారి మెడల్ హాట్ ఫేవరెట్లలో ఒకడిగా ఉన్నాడు. కానీ అతడు కనీసం క్వార్టర్స్‌కు చేరుకోకపోవడం తీవ్ర నిరాశ కలిగించేదే. బౌట్ మొత్తం అటాకింగ్ కంటే డిఫెన్స్‌కే ప్రాధాన్యమిచ్చిన అమిత్.. తగిన మూల్యం చెల్లించాడు. రౌండ్ ఆఫ్ 8లో అతాను దాస్ ఓటమి ►టోక్యో ఒలింపిక్స్‌లో ఆర్చరీ పురుషుల వ్యక్తిగత విభాగంలో అతాను దాస్ పోరు ముగిసింది. ప్రీక్వార్టర్స్‌లో భాగంగా జపాన్‌కు చెందిన ఫురుకవా తకహారుతో జరిగిన మ్యాచ్‌లో అతాను 6-4 తేడాతో పరాజయం పాలయ్యాడు. తొలి మూడు సెట్ల పాటు వీరిద్దరు హోరాహోరీగా తలప్డడారు. అయితే నాలుగ, ఐదో సెట్లో అతాను వరుసగా 27, 28 పాయింట్లు సాధించాడు. అయితే జపాన్ ఆటగాడు తకహారు 28, 29 పాయింట్లు సాధించడంతో అతాను దాస్ ఓటమి ఖాయమైంది. డిస్కస్ త్రోలో సీమా పూనియా ఐదో స్థానం ►టోక్యో ఒలింపిక్స్‌లో డిస్కస్ త్రో విభాగంలో సీమా పూనియా బరిలోకి దిగి నిరాశపరిచింది. లాంగ్ డిస్కస్ త్రో విభాగంలో ఆమె 60.57 మీటర్ల దూరం విసిరి ఐదో స్థానంలో నిలిచింది. టోక్యో ఒలింపిక్స్‌లో నేటి మ్యాచ్‌లు ఉదయం 7 గంటలకు స్విమ్మింగ్ పురుషుల 100 మీ. బటర్‌ఫ్లై ఫైనల్ ఉదయం 7:07 గంటలకు స్విమ్మింగ్ మహిళల 200 మీ. బ్యాక్‌స్ట్రోక్ ఫైనల్ ఉదయం 7:16కు స్విమ్మింగ్ మహిళల 800 మీ. ప్రీ స్టైల్ ఫైనల్ ఉదయం 7:18కి ఆర్చరీ పురుషుల వ్యక్తిగత రికర్వ్ ప్రి క్వార్టర్స్ (అతానుదాస్) -
డిస్కస్ త్రోలో సీమాకు కాంస్యమే!
ఏషియాడ్ మహిళల డిస్కస్ త్రో డిఫెండింగ్ చాంపియన్, భారత వెటరన్ క్రీడాకారిణి సీమా పూనియా... ఈసారి కాంస్యంతో వెనుదిరిగింది. గురువారం జరిగిన పోటీలో 35 ఏళ్ల సీమా డిస్క్‌ను 62.26 మీటర్లు మాత్రమే విసరగలిగింది. ఆసియా చాంపియన్, చైనా అథ్లెట్ చెన్ యాంగ్ (65.12 మీ.) స్వర్ణం నెగ్గింది. ఆ దేశానికే చెందిన ఫెంగ్ బిన్ (64.25 మీ.)కు రజతం దక్కింది. మరోవైపు 2014 ఇంచియోన్ ఏషియాడ్‌లో స్వర్ణం గెలిచిన గణాంకాలను (61.03 మీ.) సీమా సవరించినా ప్రత్యర్థులు ఇంకా మెరుగ్గా రాణించడంతో మూడో స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. గత ఆరేళ్లలో ఆమెకిదే అత్యుత్తమ రికార్డు కావడం గమనార్హం. భారత మరో త్రోయర్ సందీప్ కుమారి (54.61 మీ.) ఐదో స్థానంలో నిలిచింది. పెద్ద మనసు చాటుకుంది ఆసియా క్రీడల రోజువారీ భత్యం కింద తనకు లభించిన 700 అమెరికన్ డాలర్ల (రూ.50 వేలు)కు మరో లక్ష రూపాయలు కలిపి కేరళ వరద బాధితుల సహాయార్థం అందజేయనున్నట్లు సీమా పూనియా ప్రకటించింది. ఇతర అథ్లెట్లు కూడా తమ భత్యాల్లో కనీసం సగమైనా అందించాలని ఆమె కోరింది. స్వయంగా కేరళ వెళ్లి సహాయ చర్యల్లో పాల్గొంటానని హరియాణాకు చెందిన సీమా తెలిపింది. అక్కడి నుంచి తిరిగి వచ్చాక తన ఎడమ పాదంలో దెబ్బతిన్న ఎముకకు శస్త్ర చికిత్స చేయించుకోనున్నట్లు పేర్కొంది. గురువారం డిస్కస్ త్రో పోటీల సందర్భంగానూ గాయం ఇబ్బంది పెట్టిందని, అయితే తన వైఫల్యానికి అది కారణం కాదని వివరించింది. ఇదే సందర్భంగా తనకు అర్జున అవార్డు రాకపోవడం పట్ల ఆశ్చర్యం వ్యక్తం చేసింది. ప్రస్తుతం సీమా హరియాణా పోలీస్ శాఖలో ఎస్సైగా పనిచేస్తోంది. ద్యుతీ, స్వప్నలకు నజరానా ఏషియాడ్ మహిళల 100 మీ., 200 మీ. పరుగులో రజతాలు నెగ్గిన ద్యుతీ చంద్‌కు రూ.కోటిన్నర నగదు ప్రోత్సాహకం ఇవ్వనున్నట్లు ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ప్రకటించారు. హెప్టాథ్లాన్‌లో స్వర్ణం సాధించిన స్వప్నా బర్మన్కు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ రూ.10 లక్షల నజరానా ప్రకటించారు. -
సీమా పూనియా అవుట్
రియో డీ జనీరో:రియో ఒలింపిక్స్ లో భారత డిస్కస్క త్రో క్రీడాకారిణి సీమా పూనియా నిరాశపరిచింది. గ్రూప్-బిలో జరిగిన డిస్కస్ త్రో క్వాలిఫయింగ్ రౌండ్లో పూనియా ఫైనల్ కు అర్హత సాధించడంలో వైఫల్యం చెందింది. తొలి ప్రయత్నంలో 57.58 మీటర్లు డిస్క్ విసిరిన సీమా.. ఆ తరువాత ప్రయత్నాలో ఘోరంగా విఫలమై 20వ స్థానానికి పరిమితమైంది. డిస్కస్ త్రో పాల్గొనే వారిని రెండు గ్రూపులుగా విభజించారు. ఒకో గ్రూపులో 17 మంది క్రీడాకారిణులు పాల్గొనగా, ఫైనల్‌కు మాత్రం రెండు గ్రూపుల్లో కలిపి 12 మంది మాత్రమే అర్హత సాధిస్తారు. దీంతో డిస్కస్ త్రో ఈవెంట్లో ఫైనల్ కు చేరాలన్న సీమా ఆశలు తీరలేదు. కాగా, క్యూబీ క్రీడాకారిణి యెమీ పెరెజ్ 65. 38 మీటర్లు డిస్క్ విసిరి అగ్రస్థానంలో నిలిచింది. -
రష్యాలో సీమా పూనియా శిక్షణ!
భారత డిస్కస్ త్రోయర్ సీమా పూనియా... డోపింగ్ స్కామ్‌తో విమర్శలు ఎదుర్కొంటున్న రష్యాలో శిక్షణ తీసుకోవడానికి సిద్ధమవుతోంది. ప్రస్తుతం రష్యాలోనే ఉన్న ఆమె రష్యన్ కోచ్ విటాలియో పిచ్లెంకోవ్తో కలిసి సామాజిక సైట్లలో కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఇక్కడే శిక్షణ తీసుకునేందుకు తనకు అనుమతి ఇవ్వాలని కేంద్ర క్రీడాశాఖ, నాడా, సాయ్, అథ్లెటిక్స్ సమాఖ్యలను మెయిల్ ద్వారా కోరింది. ‘రష్యాలో శిక్షణ విషయంపై అనుమతి కోరా. ఇంటి నెంబర్‌తో సహా ఇక్కడి అడ్రస్‌ను ఇస్తానని చెప్పా. ఆగస్టు మొదటి వారం ఇక్కడే ఉండి ఆ తర్వాత రియో వెళ్తా’ అని పూనియా పేర్కొంది. అయితే ఈ విషయంలో భారత అథ్లెటిక్స్ సమాఖ్య (ఏఎఫ్ఐ) ఎటూ తేల్చుకోలేకపోతోంది. ప్రస్తుతానికి తాము ఎలాంటి అనుమతి ఇవ్వలేదని ఏఎఫ్ఐ అధికారి ఒకరు తెలిపారు. రష్యాలో శిక్షణ కోసం తన సొంత డబ్బును ఉపయోగించుకుంటున్నానని పూనియా తెలిపింది. అయితే పూనియాకు శిక్షణ ఇవ్వనున్న విటాలియో.... లండన్ ఒలింపిక్స్‌లో డోపింగ్‌లో పట్టుబడ్డ డార్యా పిచ్లెంకోవ్కు తండ్రి. -
సీమా పునియాకు కోపం వచ్చింది
న్యూఢిల్లీ: రియో డిజనిరోలో జరిగే ఒలింపిక్ క్రీడలకు అర్హత సాధించిన కొద్ది గంటల్లోనే డిస్కస్ త్రో ప్రముఖ క్రీడాకారిణి, గత ఒలంపిక్ విజేత సీమా అంతిల్ పునియా కేంద్ర క్రీడా మంత్రిత్వశాఖపై ఆగ్రహం వ్యక్తం చేసింది. విదేశాల్లో శిక్షణ మెళకువలు నేర్చుకునేందుకు తనకు నిధులు అందించడంలో ఆ శాఖ తీవ్ర నిర్లక్ష్యం చేసిందని చెప్పింది. డాక్యుమెంటేషన్ సరిగా లేదని మరిన్ని పత్రాలు జత చేయాలని, చూసే అధికారులు లేరని పలుసాకులతో తనను పలుమార్లు తిప్పారని చెప్పింది. క్రీడాకారులంటే ఆ శాఖకు తీవ్ర నిర్లక్ష్యం ఉందని ఆరోపించింది. తాను 2015 మధ్యలో తనకు శిక్షణకోసం నిధులు మంజూరు చేయాలని కేంద్ర క్రీడామంత్రిత్వశాఖను అభ్యర్థించానని, వారు నిధులు మంజూరు చేసి ఉంటే తాను అప్పుడు అర్హత సాధించే దానినని చెప్పింది. 2008లో ఆమె ఒలింపిక్ చాంపియన్‌గా నిలిచింది. తాజాగా ఒలింపిక్ క్రీడలకు అర్హత సాధించే క్రమంలో భాగంగా విదేశీ కోచ్‌కు డబ్బు చెల్లించాల్సి ఉంటుందని నాలుగుసార్లు గుర్తు చేసినా ఎవరూ పట్టించుకోలేదని పేర్కొంది. చివరకు స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ప్రాజెక్టు అధికారి దిలీప్ సింగ్ తనకు సహాయం చేసి నిధులు ఇప్పించారని, ఆయన తన ధన్యవాదాలు అని చెప్పారు. -
రియోకు సీమా పూనియా అర్హత
న్యూఢిల్లీ: ఆసియా గేమ్స్ స్వర్ణ పతక విజేత, భారత డిస్కస్ త్రో క్రీడాకారిణి సీమా పూనియా రియో ఒలింపిక్స్‌కు అర్హత సాధించింది. అమెరికాలోని కాలిఫోర్నియాలో జరుగుతున్న త్రోయర్స్ క్లాసిక్ -2016లో సీమా పూనియా 62.62 మీటర్లు విసిరి రియోకు ఎంపికైంది. రియోకు అర్హతకు 61.00 మీటర్లు మాత్రమే ప్రామాణికం కాగా, సీమా మరో మీటర్పైగా విసిరి సత్తా చాటింది. ఇది సీమాకు మూడో ఒలింపిక్స్. అంతకుముందు 2004, 2012లలో ఒలింపిక్స్ల్లో సీమా పాల్గొంది. -
సీమా పూనియాకు గోల్డ్ మెడల్
-
సీమా పూనియాకు గోల్డ్ మెడల్
ఇంచియాన్: ఆసియా క్రీడల్లో భారత్ ఐదో స్వర్ణం సాధించింది. మహిళల డిస్కస్ త్రో విభాగంలో భారత క్రీడాకారిణి సీమా పూనియా పసిడి పతకం గెల్చుకుంది. 61.03 మీటర్లు విసిరి గోల్డ్ మెడల్ సొంతం చేసుకుంది. ప్రీస్టయిల్ రెజ్లింగ్ లో భారత్ రెండు పతకాలు కైవసం చేసుకుంది. 61 కిలోల ప్రీస్టయిల్ రెజ్లింగ్ లో బజరంగ్ రతజ పతకం గెలిచాడు. 74 కేజీల విభాగంలో నర్సింగ్ యాదవ్ కాంస్య పతకం కైవసం చేసుకున్నాడు. 300 మీటర్ల స్టిపెల్చేజ్ లో నవీన్ కుమార్ కాంస్యం దక్కించుకున్నాడు. మహిళల 1500 మీటర్ల రేస్ లో ఓపీ జైషా కాంస్య పతకం సొంతం చేసుకుంది.