ప్రొడునోవాను కొనసాగిస్తా: దీప | Dipa Karmakar Revealed About Our Sordid System | Sakshi
Sakshi News home page

ప్రొడునోవాను కొనసాగిస్తా: దీప

Aug 21 2016 1:01 AM | Updated on Sep 4 2017 10:06 AM

ప్రొడునోవాను కొనసాగిస్తా: దీప

ప్రొడునోవాను కొనసాగిస్తా: దీప

‘వాల్ట్ ఆఫ్ డెత్’గా పిలిచే ప్రొడునోవా విన్యాసాన్ని ఇకముందు కూడా కొనసాగిస్తానని దీపా కర్మాకర్ స్పష్టం చేసింది.

న్యూఢిల్లీ: ‘వాల్ట్ ఆఫ్ డెత్’గా పిలిచే ప్రొడునోవా విన్యాసాన్ని ఇకముందు కూడా కొనసాగిస్తానని దీపా కర్మాకర్ స్పష్టం చేసింది. రియోలో అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్న దీప శనివారం కోచ్ విశ్వేశ్వర్ నందితో కలిసి భారత్ చేరుకుంది. ఈ సందర్భంగా ఆమెకు ఢిల్లీలో ఘనస్వాగతం లభించింది. ‘ఒలింపిక్ పతకం కోసం గట్టిగా కృషిచేశా.

కానీ ఈసారి సాధించలేకపోయాను. వచ్చే ఒలింపిక్స్‌లో తప్పకుండా పతకం గెలుస్తాను. ప్రొడునోవా విన్యాసాన్ని భవిష్యత్‌లో కూడా కొనసాగిస్తా. అందరు అనుకుంటున్నట్లు అది డెత్‌వాల్ట్ విన్యాసం కాదు. సరిగ్గా ప్రాక్టీస్ చేస్తే ప్రొడునోవా చేయడం కష్టమేం కాదు’ అని దీపా పేర్కొంది.

 

Advertisement
 
Advertisement
Advertisement