‘వరల్డ్‌కప్‌లో దినేశ్‌ కార్తీక్‌ ఆడతాడు’

Dinesh Karthik Will Be Part Of India’s World Cup Squad, Simon Katich - Sakshi

సిడ్నీ: టీమిండియా క్రికెటర్‌ దినేశ్‌ కార్తీక్‌ వరల్డ్‌కప్‌కు ఎంపికవుతాడని కోల్‌కతా నైట్‌రైడర్స్‌ సహాయ కోచ్‌ సైమన్‌ కటిచ్‌ ధీమా వ్యక్తం చేశాడు. ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(ఐపీఎల్‌)లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌కు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న దినేశ్‌ కార్తీక్‌ ఒక మంచి ఫినిషర్‌గా పేరుతెచ్చుకోవడం అతనికి కలిసి వస్తుందన్నాడు. అతనికి డెత్‌ ఓవర్లలో బౌలింగ్‌ చేయడం చాలా కష్టమన్నాడు. ఇటీవల కాలంలో భారత జట్టు తరఫున అతడు మ్యాచ్‌లు ముగించిన తీరు అతన్ని వరల్డ్‌కప్‌ రేసులో నిలుపుతుందన్నాడు.

‘దినేశ్‌ అనుభవం ఉపయోగపడుతుంది. అతడు ప్రపంచకప్‌ జట్టులో ఉంటాడు. ప్రతిభావంతులు చాలా మంది ఉండటంతో భారత సెలక్టర్లకు జట్టును ఎంపిక చేయడం కష్టమవుతుంది. దినేశ్‌ ఒక మంచి ఫినిషర్‌. దాంతో అతని ఎంపిక దాదాపు ఖాయమే’ అని కటిచ్‌ పేర్కొన్నాడు.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top