పాక్‌పై విజయం తర్వాత న్యూలుక్‌! | Dhoni,Kohli and Hardik get new haircuts after Pakistan win | Sakshi
Sakshi News home page

పాక్‌పై విజయం తర్వాత న్యూలుక్‌!

Jun 20 2019 4:29 PM | Updated on Jun 20 2019 4:29 PM

Dhoni,Kohli and Hardik get new haircuts after Pakistan win - Sakshi

లండన్‌: అదిరేటి లుక్‌కు సిద్ధం అంటున్నారు భారత క్రికెటర్లు విరాట్‌ కోహ్లి, ఎంఎస్‌ ధోని, హార్దిక్‌ పాండ్యా, యజ్వేంద్ర చహల్‌లు. తమ హెయిర్‌స్టైల్స్‌ను మార్చుకుని కొత్త లుక్‌లో దర్శనం ఇచ్చారు. వన్డే వరల్డ్‌కప్‌లో భాగంగా పాకిస్తాన్‌పై ఘన విజయం తర్వాత భారత జట్టుకు తగినంత విశ్రాంతి లభించింది. ఈ క్రమంలోనే వీరు లండన్‌ వీధుల్లో షికార్లు కొడుతూ సేద తీరుతున్నారు. కాగా, కోహ్లి, ధోని, హార్దిక్‌ పాండ్యా, చహల్‌లు మాత్రం సరికొత్త హెయిర్‌కటింగ్‌తో తళుక్కుమన్నారు. ప్రముఖ హెయిర్‌స్టైలిస్ట్‌ అలీమ్‌ హకీమ్‌ వీరికి కొత్త లుక్‌ ఇచ్చాడు. దీనికి సంబంధించిన ఫోటోలను ఇండియన్‌ క్రికెట్‌ టీమ్‌ ఇన్‌స్టాగ్రామ్‌ అకౌంట్‌తో పాటు అలీమ్‌ హకీమ్‌ తన ట్వీటర్‌ అకౌంట్‌లో పోస్ట్‌ చేశాడు.


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement