ధోని చెప్పాడు.. నేను ఆడేశా! | Dhoni told me to bat like I do in Test cricket, Bhuvneshwar | Sakshi
Sakshi News home page

ధోని చెప్పాడు.. నేను ఆడేశా!

Aug 25 2017 3:51 PM | Updated on Sep 12 2017 1:00 AM

శ్రీలంకతో రెండో వన్డేలో హాఫ్ సెంచరీ సాధించి భారత జట్టు గెలుపులో కీలక పాత్ర పోషించడానికి సహచర ఆటగాడు ఎంఎస్ ధోనినే కారణమంటున్నాడు పేసర్ భువనేశ్వర్ కుమార్.

పల్లెకెలె: శ్రీలంకతో రెండో వన్డేలో హాఫ్ సెంచరీ సాధించి భారత జట్టు గెలుపులో కీలక పాత్ర పోషించడానికి సహచర ఆటగాడు ఎంఎస్ ధోనినే కారణమంటున్నాడు పేసర్ భువనేశ్వర్ కుమార్. 'నేను క్రీజ్ లోకి వచ్చిన క్షణంలో నాకు ధోని ఆత్మవిశ్వాసాన్ని ఇచ్చాడు. ముందు ఒత్తిడి లోనుకాకుండా నా సహజసిద్ధమైన ఆటను ఆడమన్నాడు. ఇక్కడ చాలా ఓవర్లు ఉన్నాయనే విషయాన్ని గుర్తుపెట్టుకోమన్నాడు. ప్రధానంగా టెస్టుల్లో నువ్వు ఏ రకంగా ఆడతావో, అదే తరహాలో బ్యాటింగ్ కొనసాగించమన్నాడు. దాంతో నాపై ఒత్తిడిని తగ్గించుకునే యత్నం చేశా. ధోని చెప్పినట్లే క్రీజ్ లో నిలబడటానికి తొలి ప్రాధాన్యత ఇచ్చి ఒక్కో పరుగును కూడబెడతూ ముందుగా సాగా. ఆ క్రమంలోనే విలువైన భాగస్వామ్యం నమోదైంది. అదే జట్టు విజయానికి దోహదం చేసింది' అని భువీ తెలిపాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement