ఆస్ట్రేలియాకు ఎంఎస్‌ ధోని | Dhoni, Rohit Sharma depart for ODI series | Sakshi
Sakshi News home page

ఆస్ట్రేలియాకు ఎంఎస్‌ ధోని

Jan 8 2019 10:53 AM | Updated on Jan 8 2019 10:53 AM

Dhoni, Rohit Sharma depart for ODI series - Sakshi

న్యూఢిల్లీ: భారత క్రికెట్‌ జట్టు మాజీ కెప్టెన్‌ ఎంఎస్‌ ధోని.. ఆస్ట్రేలియాకు బయల్దేరాడు. ఈ నెల 12 నుంచి ఆరంభం కానున్న వన్డే సిరీస్‌లో సభ్యుడిగా ఉన్న ధోని సోమవారం ఆస్ట్రేలియాకు పయనమయ్యాడు. ధోనితో పాటు రోహిత్‌ శర్మ, కేదార్‌ జాదవ్‌, ఖలీల్‌ అహ్మద్‌లు సైతం ఆస్ట్రేలియాకు బయల్దేరారు. ఈ క్రమంలోనే  వారు విమానం ఎక్కిన తర్వాత తీసుకున్న సెల్ఫీను కేదార్‌ జాదవ్‌ సోషల్‌ మీడియాలో షేర్‌ చేశాడు. ఇక, రోహిత్‌ శర్మ టెస్టు జట్టులో కూడా సభ్యుడిగా ఉన్నప్పటికీ కూతురు పుట్టడంతో ఆసీస్‌తో ఆఖరిదైన నాలుగో టెస్టు ముందు భారత్‌కు వచ్చిన విషయం తెలిసిందే. ఆసీస్‌తో జరిగిన నాలుగు టెస్టుల సిరీస్‌ను భారత్‌ 2-1తో కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. అంతకముందు ఇరు జట్ల మధ్య జరిగిన టీ20 సిరీస్‌ సమం అయ్యింది.

ఆసీస్‌తో తలపడే భారత జట్టు ఇదే: విరాట్‌ కోహ్లి(కెప్టెన్‌), రోహిత్‌ శర్మ, కేఎల్‌ రాహుల్‌, శిఖర్‌ ధావన్‌, అంబటి రాయుడు, దినేశ్‌ కార్తీక్‌, కేదర్‌ జాదవ్‌, ఎంఎస్‌ ధోని, హార్దిక్‌ పాండ్యా, కుల్దీప్‌ యాదవ్‌, యజ్వేంద్ర చాహల్‌, రవీంద్ర జడేజా, భువనేశ్వర్‌ కుమార్‌, బూమ్రా, మహ్మద్‌ షమీ, ఖలీల్‌ అహ్మద్‌ 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement