
తైపీ: ఆసియా కప్ వరల్డ్ ర్యాంకింగ్ స్టేజ్–3 ఆర్చరీ టోర్నమెంట్‌లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించిన ఆంధ్రప్రదేశ్ ఆర్చర్ బొమ్మదేవర ధీరజ్ టీమ్ విభాగంలో రజత పతకం గెలిచాడు. చైనీస్ తైపీలో మంగళవారం ముగిసిన ఈ టోర్నీలో ధీరజ్, షుక్‌మణి బబ్రేకర్, గోరా హోలతో కూడిన భారత జట్టు పురుషుల టీమ్ రికర్వ్ విభాగంలో రన్నరప్‌గా నిలిచింది.
ఫైనల్లో భారత బృందం 1–5తో కొరియా జట్టు చేతిలో ఓడిపోయింది. విజయవాడలోని చెరుకూరి ఓల్గా ఆర్చరీ అకాడమీలో శిక్షణ పొందుతున్న ధీరజ్ వ్యక్తిగత విభాగంలో క్వార్టర్ ఫైనల్లో నిష్క్రమించాడు. ఈ టోర్నీలో ఓవరాల్‌గా భారత్‌కు నాలుగు రజతాలు, ఒక కాంస్య పతకం లభించాయి.