డిఫెండింగ్‌ చాంపియన్‌కు చుక్కెదురు | Defending Champion Garbine Muguruza Knocked Out As Seeds Scatter | Sakshi
Sakshi News home page

డిఫెండింగ్‌ చాంపియన్‌కు చుక్కెదురు

Jul 6 2018 11:13 AM | Updated on Jul 6 2018 11:22 AM

Defending Champion Garbine Muguruza Knocked Out As Seeds Scatter - Sakshi

లండన్‌:  డిఫెండింగ్‌ చాంపియన్‌, స్పెయిన్‌ యువతార గార్బిన్‌ ముగురుజాకు వింబుల్డన్‌ గ్రాండ్‌స్లామ్‌ టోర్నమెంట్‌ రెండో రౌండ్‌లోనే చుక్కెదురైంది. గురువారం జరిగిన మహిళల సింగిల్స్‌లో ముగురుజా 7-5, 2-6, 1-6 తేడాతో బెల్జియంకు చెందిన అన్‌ సీడెడ్‌ క్రీడాకారిణి వాన్‌ వుయ్‌త్వాంక్‌ చేతిలో పరాజయం పాలై టోర్నీ నుంచి నిష్క్రమించింది.   తొలి సెట్‌ను గెలిచిన ముగురుజా.. ఆపై రెండు సెట్లలో దారుణంగా వైఫల్యం చెందడంతో ఓటమి తప్పలేదు. మరొకవైపు సంచలన విజయాన్ని నమోదు చేసిన వుయ్‌త్వాంక్‌... తన కెరీర్‌లోనే తొలిసారి టాప్‌-10 ప్రత్యర్థిపై గెలిచిన ఘనతను సైతం సొంతం చేసుకుంది.

ఈ మ్యాచ్‌లో వుయ్‌త్వాంక్‌ నాలుగు ఏస్‌లు సంధించగా, ముగురుజా మూడు ఏస్‌లకు మాత‍్రమే పరిమితమైంది. మరొకవైపు ముగురుజా 3 డబుల్‌ ఫాల్ట్స్‌ చేయగా,, వుయ్‌త్వాంక్‌లు రెండు చేసింది. ఇక ఏడు బ్రేక్‌ పాయింట్లను వుయ్‌త్వాంక్‌ గెలవగా, నాలుగు బ్రేక్‌ పాయింట్లను ముగురుజా గెలిచింది. మొత్తంగా 91 పాయింట్లను వుయ్‌త్వాంక్‌ గెలిస్తే, ముగురుజా 75 పాయింట్లను మాత్రమే సాధించి ఓటమి పాలైంది.

Advertisement
 
Advertisement
Advertisement