డివిలియర్స్ ‘సెంచరీ’ మిస్! | De Villiers 'century' Miss! | Sakshi
Sakshi News home page

డివిలియర్స్ ‘సెంచరీ’ మిస్!

May 28 2015 12:57 AM | Updated on May 25 2018 2:34 PM

కెరీర్ ఆరంభమైననాటినుంచి వరుసగా వంద టెస్టులు ఆడిన తొలి క్రికెటర్ రికార్డుకు చేరువగా వచ్చిన దక్షిణాఫ్రికా బ్యాట్స్‌మన్ ఏబీ డివిలియర్స్ దానిని త్రుటిలో కోల్పోయాడు.

బంగ్లాతో టెస్టు సిరీస్‌కు దూరం
 
కేప్‌టౌన్ : కెరీర్ ఆరంభమైననాటినుంచి వరుసగా వంద టెస్టులు ఆడిన తొలి క్రికెటర్ రికార్డుకు చేరువగా వచ్చిన దక్షిణాఫ్రికా బ్యాట్స్‌మన్ ఏబీ డివిలియర్స్ దానిని త్రుటిలో కోల్పోయాడు. తన భార్య ప్రసవం కారణంగా బంగ్లాదేశ్‌తో జరిగే రెండు టెస్టుల సిరీస్‌కు దూరమయ్యాడు. డివిలియర్స్ తన కెరీర్‌లో వరుసగా 98 టెస్టు మ్యాచ్‌లు ఆడాడు. అయితే వన్డే జట్టుకు మాత్రం డివిలియర్స్ సారథ్యం వహించనుండగా... టెస్టు కెప్టెన్‌గా ఆమ్లా, టి20 కెప్టెన్‌గా డు ప్లెసిస్ కొనసాగుతారు. జులై 5నుంచి 30 వరకు బంగ్లాదేశ్‌లో పర్యటించనున్న దక్షిణాఫ్రికా జట్టు 2 టి20లు, 3 వన్డేలు, 2 టెస్టులు ఆడుతుంది. 

వాట్సన్‌కు కూతురు
 సిడ్నీ: ఆస్ట్రేలియా క్రికెటర్ షేన్‌వాట్సన్ మరోసారి తండ్రయ్యాడు. గత శనివారం వాట్సన్ భార్య లీ అమ్మాయికి జన్మనిచ్చింది. వాట్సన్‌కు ఇప్పటికే విల్ అనే రెండేళ్ల కొడుకు ఉన్నాడు. కూతురుతో కలిసి ఉన్న ఫోటోలను వాట్సన్ ట్విట్టర్‌లో ఉంచాడు.

Advertisement
 
Advertisement
Advertisement