స్టెయిన్ రాణింపు, దక్షిణాఫ్రికా ఘనవిజయం | Dale Steyn stars in big South Africa win | Sakshi
Sakshi News home page

స్టెయిన్ రాణింపు, దక్షిణాఫ్రికా ఘనవిజయం

Jul 20 2014 4:40 PM | Updated on Nov 9 2018 6:43 PM

స్టెయిన్ రాణింపు, దక్షిణాఫ్రికా ఘనవిజయం - Sakshi

స్టెయిన్ రాణింపు, దక్షిణాఫ్రికా ఘనవిజయం

ఫాస్ట్ బౌలర్ డేల్ స్టెయిన్ రాణించడంతో శ్రీలంకపై దక్షిణాఫ్రికా 153 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది.

ఫాస్ట్ బౌలర్ డేల్ స్టెయిన్ రాణించడంతో శ్రీలంకపై దక్షిణాఫ్రికా 153 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. తొలి టెస్ట్ మ్యాచ్ లో స్టెయిన్ విజృంభించి 99 పరుగులిచ్చి 9 వికెట్లు పడగొట్టడంతో గాలే టెస్ట్ లో దక్షిణాఫ్రికా గెలిచింది. స్టెయిన్ కు మార్కెల్ అండగా నిలిచి నాలుగు వికెట్లు సొంతం చేసుకున్నాడు. టెస్ట్ క్రికెట్ లో తొలిసారి కెప్టెన్ గా వ్యవహరిస్తున్న హషీం ఆమ్లా చిరస్మరణీయమైన విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు. 
 
రెండవ ఇన్నింగ్స్ లో అత్యధికంగా సంగక్కర 76, సిల్వా 38 పరుగులు తప్పా.. మిగితా ఆటగాళ్లెవరూ పెద్గగా రాణించలేకపోవడంతో 216 పరుగులకు శ్రీలంక ఆటౌటైంది. తొలి ఇన్నింగ్స్ లో 5 వికెట్లు సొంతం చేసుకున్న స్టెయిన్ రెండవ ఇన్నింగ్స్ లో 4 వికెట్లు తీసుకున్నాడు. మార్కెల్ 4, డ్యుమినీ 2 వికెట్లు పడగొట్టారు. 
 
స్కోర్లు: తొలి ఇన్నింగ్స్: దక్షిణాఫ్రికా 455,  శ్రీలంక: 292
రెండవ ఇన్నింగ్స్: దక్షిణాఫ్రికా 206,  రెండవ ఇన్నింగ్స్ 216
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement