సఫారీ జట్టులో డి లాంజ్‌కు చోటు | d lonj in safari team | Sakshi
Sakshi News home page

సఫారీ జట్టులో డి లాంజ్‌కు చోటు

Nov 21 2015 12:05 AM | Updated on Sep 3 2017 12:46 PM

గాయం నుంచి పూర్తిగా కోలుకోని దక్షిణాఫ్రికా ప్రధాన పేస్ బౌలర్ డేల్ స్టెయిన్ మూడో టెస్టుకూ దూరమయ్యే అవకాశం ఉంది.

మూడో టెస్టుకూ స్టెయిన్ దూరం!
 నాగపూర్: గాయం నుంచి పూర్తిగా కోలుకోని దక్షిణాఫ్రికా ప్రధాన పేస్ బౌలర్ డేల్ స్టెయిన్ మూడో టెస్టుకూ దూరమయ్యే అవకాశం ఉంది. తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో బౌలింగ్ చేయని అతను బెంగళూరు మ్యాచ్ ఆడలేదు. అతని గాయంపై ఇంకా స్పష్టత రాకపోవడంతో దక్షిణాఫ్రికా ముందు జాగ్రత్తగా మర్చంట్ డి లాంజ్‌ను జట్టులోకి ఎంపిక చేసింది. భారత్‌తో తొలి టి20 మ్యాచ్ ఆడిన అతను ప్రస్తుతం దక్షిణాఫ్రికా దేశవాళీ పోటీల్లో పాల్గొంటున్నాడు. ‘ప్రస్తుతం మా జట్టులో ముగ్గురు పేసర్లే ఫిట్‌గా ఉన్నారు. మళ్లీ ఎవరైనా గాయపడితే ఇబ్బందని డి లాంజ్‌ను పిలిపించాం. మంచి వేగంతో రివర్స్ స్వింగ్ చేయగల అతని నైపుణ్యం జట్టుకు ఉపయోగపడుతుందని నమ్ముతున్నాం’ అని జట్టు కోచ్ రసెల్ డొమింగో చెప్పారు. కెరీర్‌లో 2 టెస్టులే ఆడిన డి లాంజ్, ఆఖరిసారిగా 2012లో బరిలోకి దిగాడు.
 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement