ఐపీఎల్ ఫైనల్‌; మీ ఓటు ఎవరికి? | CSKvsSRH Who Will Win In IPL Final | Sakshi
Sakshi News home page

May 27 2018 2:38 PM | Updated on May 27 2018 2:41 PM

CSKvsSRH Who Will Win In IPL Final - Sakshi

ఐపీఎల్‌ అధికారిక వెబ్‌సైట్‌ ఫొటో

ముంబై: ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌) 11వ సీజన్‌ ఫైనల్లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌, చెన్నై సూపర్‌ కింగ్స్‌ జట్లు తలపడనున్నాయి. ఈ రోజ రాత్రి  7 గంటలకు వాంఖెడే మైదానం వేదికగా జరిగే తుదిపోరులో విజయం ఏ జట్టు వరిస్తుందోనని క్రికెట్‌ అభిమానులు అమితాసక్తితో ఎదురుచూస్తున్నారు. లీగ్‌ దశలో పైచేయి సాధించిన ధోని సేనను ఓడించి కప్‌ అందుకోవాలని సన్‌రైజర్స్‌ భావిస్తోంది. హైదరాబాద్‌పై తమ ఆధిపత్యం కొనసాగించి విజేతగా నిలవాలని సూపర్స్‌ కింగ్స్‌ ఉవ్విళ్లూరుతోంది.

మరోవైపు ఐపీఎల్‌ తుది సమరంపై సామాజిక మాధ్యమాల్లో విశేషంగా చర్చ జరుగుతోంది. ఇది బిర్యానీ, సాంబార్‌ మధ్య పోటీగా వర్ణిస్తున్నారు. సీఎస్‌కే వర్సెస్‌ ఎస్‌ఆర్‌హెచ్‌ ట్యాగ్‌ ట్విటర్‌ టాప్‌ ట్రెండింగ్‌లో ఉంది. అటు బెట్టింగులు కూడా భారీ స్థాయిలో జరిగే అవకాశముందని వార్తలు వస్తున్నాయి. ఏది ఎలా ఉన్నా ఫైనల్‌ పోరు ఆసక్తికరంగా, ఉత్కంఠభరితంగా జరిగి వినోదాన్ని అందించాలని అభిమానులు కోరుకుంటున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement