
బాలీవుడ్‌లోకి మరో క్రికెటర్!
డ్వేన్ బ్రావో బాటలోనే మరో వెస్టిండీస్ క్రికెటర్ ఆండ్రీ రస్సెల్ ఎంటర్‌టైన్‌మెంట్ రంగంలోకి అడుగుపెడుతున్నాడు.
ముంబై: డ్వేన్ బ్రావో బాటలోనే మరో వెస్టిండీస్ క్రికెటర్ ఆండ్రీ రస్సెల్ ఎంటర్‌టైన్‌మెంట్ రంగంలోకి అడుగుపెడుతున్నాడు. ఈ ఏడాది ఓ ఇంటర్నేషనల్ మ్యాజిక్ వీడియోను విడుదల చేయడానికి ప్లాన్ చేసుకున్న రస్సెల్.. బాలీవుడ్పై తనకున్న ఆసక్తిని తాజాగా బయటపెట్టాడు.
'కళల రంగంలో రాణించడానికి ప్రయత్నిస్తున్నాను. ఈ ఏడాది లాంచ్ చేసే మొదటి ఇంటర్నేషనల్ మ్యూజిక్ వీడియోను ఎక్కువగా ఇండియాను దృష్టిలో ఉంచుకునే చేస్తున్నాం. ఆ తరువాత కుదిరితే బాలీవుడ్‌లో నటిస్తానేమో' అని శనివారం ఓ ప్రకటనలో రస్సెల్ తెలిపాడు. జస్టిన్ బీబర్ గ్రామీ అవార్డ్ విన్నింగ్ ఆల్బమ్ 'సారీ' కి ప్రొడక్షన్ హౌస్‌గా ఉన్న సంస్థనే రస్సెల్ మ్యూజిక్ ఆల్బమ్‌ను ప్రొడ్యూస్ చేస్తోంది. కాగా.. డ్వేన్ బ్రావో ఇప్పటికే.. 'ఛాంపియన్', 'ట్రిప్ అబీ బాకీ హై' లాంటి మ్యూజిక్ వీడియోలను విడుదల చేసిన విషయం తెలిసిందే.