ఇటలీపై కోస్టారికా సంచలన విజయం | Costa Rica stun Italy 1-0 to enter last 16, England ousted | Sakshi
Sakshi News home page

ఇటలీపై కోస్టారికా సంచలన విజయం

Jun 20 2014 11:47 PM | Updated on Oct 2 2018 8:39 PM

ప్రపంచకప్ ఫుట్ బాల్ టోర్నీలో కోస్టారికా సంచలన విజయం నమోదు చేసింది.

రెసిఫై:ప్రపంచకప్ ఫుట్ బాల్ టోర్నీలో కోస్టారికా సంచలన విజయం నమోదు చేసింది. ఈ రోజు గ్రూప్ -డిలో భాగంగా ఇక్కడ ఇటలీ తో జరిగిన మ్యాచ్ లో 1-0 తేడాతో విజయం సాధించిన కోస్టారికా తొలిసారి నాకౌట్ చేరుకుంది. బలమైన అటాకింగ్ ఉన్నఇటలీపై కోస్టారికా ఎదురుదాడి చేసి విజయాన్ని తనఖాతాలో వేసుకుంది. ఆట 44 నిమిషంలో బ్రయన్ రూయిజ్ అద్భుతమైన గోల్ చేసి జట్టుకు గెలుపునందించాడు. ఈ తాజా విజయంతో ఇంగ్లండ్ ఆశలకు గండిపడింది. ఏమాత్రం అంచనాలు లేకుండా బరిలోకి దిగిన కోస్టారికా విజయం ఇటలీ, ఇంగ్లండ్ అభిమానుల్ని షాక్ కు గురి చేసింది.

నాలుగుసార్లు ఫుట్ బాల్ చాంపియన్ గా నిలిచిన ఇటలీ చావురేవో తేల్చుకోని నాకౌట్ రేస్ లో ఉండాలంటే కనీసం ఉరుగ్వే తో జరిగే మ్యాచ్ లో  డ్రాతో అయినా గట్టెక్కాలి. ఒకవేళ అదే జరిగితే ఇటలీ నాకౌట్ చేరుతుంది. కాని పక్షంలో ఇటలీ కూడా ఇంటి ముఖం పట్టక తప్పదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement