ఆ మాత్రం 'గొడవ' లేకపోతే ఎలా: కుక్ | Cook frustrated after Stokes receives fine | Sakshi
Sakshi News home page

ఆ మాత్రం 'గొడవ' లేకపోతే ఎలా: కుక్

Oct 31 2016 12:51 PM | Updated on Sep 4 2017 6:48 PM

ఆ మాత్రం 'గొడవ' లేకపోతే ఎలా: కుక్

ఆ మాత్రం 'గొడవ' లేకపోతే ఎలా: కుక్

బంగ్లాదేశ్తో రెండో టెస్టులో తమ ఆటగాడు బెన్ స్టోక్స్కు జరిమానా విధించడంపై ఇంగ్లండ్ కెప్టెన్ అలెస్టర్ కుక్ అసంతృప్తి వ్యక్తం చేశాడు.

మిర్పూర్:బంగ్లాదేశ్తో రెండో టెస్టులో తమ ఆటగాడు బెన్ స్టోక్స్కు  జరిమానా  విధించడంపై ఇంగ్లండ్ కెప్టెన్ అలెస్టర్ కుక్ అసంతృప్తి వ్యక్తం చేశాడు. బంగ్లాదేశ్ బ్యాట్స్మన్ షబ్బిర్ రెహ్మాన్తో మాటల యుద్ధానికి దిగడంతో స్టోక్స్కు మ్యాచ్ ఫీజులో 15 శాతం జరిమానా విధించడాన్ని  కుక్ తప్పుబట్టాడు. ఆటలో సర్వసాధారణంగా వాగ్వాదాలు చోటు చేసుకుంటాయని స్టోక్స్ ప్రవర్తనను  సమర్ధించాడు.


అసలు ఆటలో ఆ మాత్రం మజా ఉండకపోతే ఎలా అని కుక్ ప్రశ్నిస్తున్నాడు. 'ఆ ఇద్దరు కాంపిటేటివ్ క్రికెటర్లు. నా వరకూ అయితే ఆ మాత్రం వాగ్వాదాన్ని ప్రజలు కూడా ఆహ్వానిస్తారు. క్రికెట్ అభిమానులకు ఆటలో పసందు ఉండాలి కదా. ఏది ఏమైనా  స్టోక్స్కు జరిమానా వేయడం నన్ను కాస్త నిరాశకు గురి చేసింది'అని కుక్ తెలిపాడు.


రెండో టెస్టులో భాగంగా ఆదివారం ఉదయం ఆటలో షబ్బిర్ ను పదే పదే రెచ్చగొడుతూ స్టోక్స్ ప్రవర్తించాడు. అతని మీదుకు దూసుకువస్తూ దురుసగా వ్యవహరించాడు. దీనిపై ఆన్ ఫీల్డ్ అంపైర్లు పలుమార్లు స్టోక్స్ను మందలించినా వారి మాటలను పెడచెవిన పెట్టాడు. ఇది క్రీడా స్ఫూర్తికి విరుద్దంగా కావడంతో స్టోక్స్కు జరిమానా విధిస్తూ ఐసీసీ నిర్ణయం తీసుకుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement