శ్యామ్‌కు పతకం ఖాయం | Confirmed medal to Sam | Sakshi
Sakshi News home page

శ్యామ్‌కు పతకం ఖాయం

Apr 6 2017 1:26 AM | Updated on Sep 5 2017 8:01 AM

శ్యామ్‌కు పతకం ఖాయం

శ్యామ్‌కు పతకం ఖాయం

థాయ్‌లాండ్‌ ఓపెన్‌ అంతర్జాతీయ బాక్సింగ్‌ టోర్నమెంట్‌లో భారత్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న ఆంధ్రప్రదేశ్‌ బాక్సర్‌ కాకర శ్యామ్‌

న్యూఢిల్లీ: థాయ్‌లాండ్‌ ఓపెన్‌ అంతర్జాతీయ బాక్సింగ్‌ టోర్నమెంట్‌లో భారత్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న ఆంధ్రప్రదేశ్‌ బాక్సర్‌ కాకర శ్యామ్‌ కుమార్‌ కనీసం కాంస్య పతకాన్ని ఖాయం చేసుకున్నాడు. బ్యాంకాక్‌లో జరుగుతోన్న ఈ టోర్నీలో శ్యామ్‌ కుమార్‌ 49 కేజీల విభాగంలో సెమీఫైనల్లోకి ప్రవేశించాడు.

శ్యామ్‌తోపాటు రోహిత్‌ టోకస్‌ (64 కేజీలు) సెమీఫైనల్లోకి దూసుకెళ్లగా... కామన్వెల్త్‌ గేమ్స్‌ మాజీ చాంపియన్‌ మనోజ్‌ కుమార్‌ (69 కేజీలు) క్వార్టర్‌ ఫైనల్లో ఓడిపోయాడు. క్వార్టర్‌ ఫైనల్‌ బౌట్స్‌లో సమక్‌ సెహాన్‌ (థాయ్‌లాండ్‌)పై శ్యామ్‌; కుతోవ్‌ కువాన్‌ (కజకిస్తాన్‌)పై రోహిత్‌ గెలుపొందారు. గియాసోవ్‌ షాక్రమ్‌ (ఉజ్బెకిస్తాన్‌) చేతిలో మనోజ్‌ ఓటమి పాలయ్యాడు.  

Advertisement
 
Advertisement
Advertisement