ఇంగ్లండ్, ఆసీస్ హోరాహోరీ | Commonwealth Games: England beaten to gold by Australia in men's team pursuit final | Sakshi
Sakshi News home page

ఇంగ్లండ్, ఆసీస్ హోరాహోరీ

Jul 26 2014 1:31 AM | Updated on Sep 2 2017 10:52 AM

కామన్వెల్త్ క్రీడల్లో ఇంగ్లండ్, ఆస్ట్రేలియా మధ్య పతకాల వేట హోరాహోరీగా కొనసాగుతోంది. తొలిరోజు సాధించిన మొత్తం పతకాల్లో సమానంగా నిలిచినా..

గ్లాస్గో: కామన్వెల్త్ క్రీడల్లో ఇంగ్లండ్, ఆస్ట్రేలియా మధ్య పతకాల వేట హోరాహోరీగా కొనసాగుతోంది. తొలిరోజు సాధించిన మొత్తం పతకాల్లో సమానంగా నిలిచినా.. స్వర్ణాలు ఎక్కువగా దక్కించుకున్న ఇంగ్లండ్ రెండో రోజు కూడా అదే ఆధిపత్యం ప్రదర్శించింది. సైక్లింగ్‌లో ఒక స్వర్ణంతోపాటు రెండు రజతాలు సాధించింది.
 
 జూడోకాలు ఓ పసిడి, రెండు కాంస్య పతకాలను ఇంగ్లండ్‌కు అందిస్తే, షూటింగ్‌లోనూ ఓ కాంస్యం దక్కించుకుంది. ఇక ఆస్ట్రేలియా శుక్రవారం సైక్లింగ్‌లో ఏకంగా ఐదు పతకాలు కొల్లగొట్టింది. ఇందులో ఒక స్వర్ణంతోపాటు మూడు రజతాలున్నాయి. 4 x100 మీ. స్విమ్మింగ్‌లో ఆస్ట్రేలియా మహిళల జట్టు ప్రపంచ రికార్డు (3 నిమిషాల 30:98 సెకన్లు) నెలకొల్పారు. ఇక ఆతిథ్య స్కాట్లాండ్ సైక్లింగ్, జూడోల్లో ఒక్కో స్వర్ణంతోపాటు మొత్తం ఆరు పతకాలు సాధించి తమ సంఖ్యను రెట్టింపు చేసుకుంది.
 

Advertisement
 
Advertisement
Advertisement