కామన్వెల్త్‌ చెస్‌ చాంప్‌ అభిజిత్‌ | Commonwealth Chess Champion Abhijit | Sakshi
Sakshi News home page

కామన్వెల్త్‌ చెస్‌ చాంప్‌ అభిజిత్‌

Jul 11 2017 12:55 AM | Updated on Sep 5 2017 3:42 PM

కామన్వెల్త్‌ చెస్‌ చాంప్‌ అభిజిత్‌

కామన్వెల్త్‌ చెస్‌ చాంప్‌ అభిజిత్‌

సొంతగడ్డపై జరిగిన కామన్వెల్త్‌ చెస్‌ చాంపియన్‌షిప్‌లో భారత గ్రాండ్‌మాస్టర్స్‌ మెరిశారు. సోమవారం ముగిసిన ఈ టోర్నీలో అభిజిత్‌ గుప్తా విజేతగా నిలువగా.

న్యూఢిల్లీ: సొంతగడ్డపై జరిగిన కామన్వెల్త్‌ చెస్‌ చాంపియన్‌షిప్‌లో భారత గ్రాండ్‌మాస్టర్స్‌ మెరిశారు. సోమవారం ముగిసిన ఈ టోర్నీలో అభిజిత్‌ గుప్తా విజేతగా నిలువగా... వైభవ్‌ సూరి రెండో స్థానంలో, తేజస్‌ బాక్రే మూడో స్థానంలో నిలిచారు. నిర్ణీత తొమ్మిది రౌండ్‌లు ముగిశాక అభిజిత్‌ గుప్తా 7.5 పాయింట్లతో అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు. ఆరు గేముల్లో గెలిచిన అభిజిత్, మిగతా మూడు గేమ్‌లను ‘డ్రా’ చేసుకొని ఈ టోర్నీలో అజేయంగా నిలిచాడు. వైభవ్, తేజస్‌ ఏడు పాయింట్లతో సంయుక్తంగా రెండో స్థానంలో నిలిచినా... మెరుగైన టైబ్రేక్‌ స్కోరు ఆధారంగా వైభవ్‌కు రెండో స్థానం, తేజస్‌కు మూడో స్థానం దక్కాయి. తెలంగాణ ప్లేయర్‌ ఎరిగైసి అర్జున్‌ 6.5 పాయింట్లతో ఏడో స్థానంలో నిలువడం విశేషం. ఐదు గేముల్లో గెలిచిన అర్జున్, మూడు గేమ్‌లను ‘డ్రా’ చేసుకొని... మరో గేమ్‌లో ఓడిపోయాడు. 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement