100 ఓవర్ల పాటు క్రీజులో ఉన్నాడు! | Cheteshwar Pujara 145 not out in colombo test | Sakshi
Sakshi News home page

100 ఓవర్ల పాటు క్రీజులో ఉన్నాడు!

Aug 30 2015 10:34 AM | Updated on Sep 3 2017 8:25 AM

100 ఓవర్ల పాటు క్రీజులో ఉన్నాడు!

100 ఓవర్ల పాటు క్రీజులో ఉన్నాడు!

శ్రీలంకతో మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్ లో సెంచరీవీరుడు చతేశ్వర్ పుజారా నాటౌట్ గా నిలిచాడు.

కొలంబో: శ్రీలంకతో మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్ లో భారత్100.1 ఓవర్లలో 312 పరుగులకు ఆలౌటైంది. 292/8 ఓవర్ నైట్ స్కోరుతో మూడో రోజు ఆట ప్రారంభించిన కోహ్లి సేన మరో 20 పరుగులు జత చేసి మిగతా 2 వికెట్లు నష్టపోయింది.

సెంచరీవీరుడు చతేశ్వర్ పుజారా నాటౌట్ గా నిలిచాడు. ఓపెనర్ గా వచ్చిన అతడు కీలక ఇన్నింగ్స్ తో జట్టును ఆదుకోవడమే కాకుంగా చివరివరకు అజేయంగా నిలిచాడు. లంక బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొని కడ వరకు బ్యాటింగ్ కొనసాగించాడు. శ్రీలంక బౌలర్ల సహనాన్ని పరీక్షిస్తూ సుదీర్ఘ ఇన్నింగ్స్ ఆడాడు. 100 ఓవర్ల పాటు అతడు క్రీజులో ఉన్నాడు.

పూజారా 289 బంతుల్లో 14 ఫోర్లతో 145 పరుగులు చేసి నాటౌట్ గా మిగిలాడు. శ్రీలంక బౌలర్లలో ప్రసాద్ 4, హెరాత్ 3 వికెట్లు పడగొట్టారు. ప్రదీప్, మాథ్యూస్, కౌశల్ తలో వికెట్ దక్కించుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement