హంపి, హారిక గెలుపు | Chess: After Humpy, Harika too in world championship pre-quarters | Sakshi
Sakshi News home page

హంపి, హారిక గెలుపు

Mar 24 2015 1:49 AM | Updated on Sep 2 2017 11:16 PM

హంపి, హారిక గెలుపు

హంపి, హారిక గెలుపు

ప్రపంచ మహిళల చెస్ చాంపియన్‌షిప్‌లో ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్లు కోనేరు హంపి, ద్రోణవల్లి హారిక తమ జోరు కొనసాగిస్తున్నారు.

సోచి (రష్యా): ప్రపంచ మహిళల చెస్ చాంపియన్‌షిప్‌లో ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్లు కోనేరు హంపి, ద్రోణవల్లి హారిక తమ జోరు కొనసాగిస్తున్నారు. సోమవారం జరిగిన ప్రిక్వార్టర్ ఫైనల్ తొలి గేమ్‌లో వీరిద్దరూ గెలిచారు.

అలీసా గలియమోవా (రష్యా)తో జరిగిన గేమ్‌లో తెల్లపావులతో ఆడిన హంపి 38 ఎత్తుల్లో గెలుపొందగా... ప్రపంచ మాజీ చాంపియన్ అలెగ్జాండ్రా కొస్టెనిక్ (రష్యా)తో జరిగిన గేమ్‌లో నల్లపావులతో ఆడిన హారిక 55 ఎత్తుల్లో అద్భుత విజయం సాధించింది. మంగళవారం జరిగే రెండో గేమ్‌లో హంపి, హారిక ‘డ్రా’ చేసుకుంటే క్వార్టర్ ఫైనల్‌కు అర్హత సాధిస్తారు.

Advertisement
 
Advertisement
Advertisement