చందనకు స్వర్ణం | Chandana Gets Gold Medal In SGF Championship | Sakshi
Sakshi News home page

చందనకు స్వర్ణం

Aug 30 2019 9:55 AM | Updated on Aug 30 2019 9:55 AM

Chandana Gets Gold Medal In SGF Championship - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: హైదరాబాద్‌ జిల్లా పాఠశాల క్రీడా సమాఖ్య (ఎస్‌జీఎఫ్‌) జిల్లా స్థాయి తైక్వాండో చాంపియన్‌íÙప్‌లో రోజరీ కాన్వెంట్‌కు చెందిన వడ్డేటి చందన సత్తా చాటింది. దోమలగూడ జీసీపీఈ వేదికగా జరిగిన ఈ టోరీ్నలో అండర్‌–17 బాలికల 49–52 కేజీల వెయిట్‌ కేటగిరీలో చందన విజేతగా నిలిచి స్వర్ణాన్ని సాధించింది. బీవీబీపీఎస్‌కు చెందిన బి. అగర్వాల్‌ రజతాన్ని గెలుచుకోగా... మదీనా హైసూ్కల్‌ విద్యార్థి రీడా మీర్జా కాంస్యాన్ని సాధించింది. బహుమతి ప్రదాన కార్యక్రమంలో నిజాం కాలేజి ప్రిన్సిపాల్‌ ఎన్‌. లక్ష్మీకాంత్‌ రాథోడ్‌ ముఖ్య అతిథిగా విచ్చేశారు.

ఇతర వెయిట్‌ కేటగిరీల విజేతల వివరాలు
25–27 కేజీల బాలురు: 1. ఆనంద్, 2. అక్షయ్, 3. నిఖిల్‌ తేజ్‌; 20–22 కేజీల బాలికలు: 1. సింధూజ, 2. మాన్వి యాదవ్‌. 29–32 కేజీల బాలురు: 1. బి. అరవింద్‌ కుమార్, 2. సంపత్‌ కుమార్, 3. అజయ్, మణిమాన్విత్‌. 24–26 కేజీల బాలికలు: 1. స్ఫూర్తి, 2. సుమయ్యా అంజుమ్, 3. చంచల్‌ యాదవ్‌. 27–29 కేజీల బాలురు: 1. సాయి సంవిత్, 2. మొహమ్మద్‌ రహమాన్, 3. ఆదిత్య వ్యాస్, కల్యాణ్‌. 26–29 కేజీల బాలికలు: 1. వర్ష, 2. జియా.

Advertisement
 
Advertisement
Advertisement