కోహ్లి కొత్త సూచన | Can give reserve day in Tests a thought: Kohli | Sakshi
Sakshi News home page

కోహ్లి కొత్త సూచన

Jun 14 2015 7:33 PM | Updated on Sep 3 2017 3:45 AM

కోహ్లి కొత్త సూచన

కోహ్లి కొత్త సూచన

వన్డే మ్యాచ్ లకు ఉన్నట్టుగానే టెస్ట్ లకూ రిజర్వు డే ఉంటే బాగుంటుందని భారత టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లి కొత్త సూచన చేశాడు.

ఫతుల్లా: వన్డే మ్యాచ్ లకు ఉన్నట్టుగానే టెస్ట్ లకూ రిజర్వు డే ఉంటే బాగుంటుందని భారత టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లి కొత్త సూచన చేశాడు. పొడుగు ఫార్మెట్ కూ రిజర్వు డే ఉండాలన్న తన సూచనపై చర్చ జరగాలన్నాడు. భారత్-బంగ్లాదేశ్ ఏకైక టెస్టు డ్రా గా ముగిసిన తర్వాత కోహ్లి విలేకరులతో మాట్లాడాడు.

'250 పైగా ఓవర్ల పాటు సాగిన టెస్టు మ్యాచ్ ఈరోజు డ్రాగా ముగిసింది. టెస్టులకూ రిజర్వు డే పెట్టి చూడాలి. మ్యాచ్ పరిస్థితిని బట్టి ఫలితం కోసం మరొక్క రోజు పొడిగించే అవకాశాన్ని పరిశీలించాలి. దీనిపై చర్చలు ఎలా జరుగుతాయనేది నాకు తెలియదు' అని కోహ్లి అన్నాడు.

Advertisement
 
Advertisement
Advertisement