బుందేలా కొత్త చరిత్ర | Bundela new history | Sakshi
Sakshi News home page

బుందేలా కొత్త చరిత్ర

Nov 29 2016 12:05 AM | Updated on Sep 4 2017 9:21 PM

బుందేలా కొత్త చరిత్ర

బుందేలా కొత్త చరిత్ర

మధ్యప్రదేశ్ క్రికెట్ జట్టు కెప్టెన్ దేవేంద్ర బుందేలా రంజీ ట్రోఫీ చరిత్రలో అత్యధిక మ్యాచ్‌లు ఆడిన ఆటగాడిగా రికార్డు సృష్టించబోతున్నాడు.

కెరీర్‌లో 137వ రంజీ మ్యాచ్ ఆడనున్న మధ్యప్రదేశ్ కెప్టెన్
తెరమరుగు కానున్న మజుందార్ రికార్డు 

ముంబై: మధ్యప్రదేశ్ క్రికెట్ జట్టు కెప్టెన్ దేవేంద్ర బుందేలా రంజీ ట్రోఫీ చరిత్రలో అత్యధిక మ్యాచ్‌లు ఆడిన ఆటగాడిగా రికార్డు సృష్టించబోతున్నాడు. నేడు (మంగళవారం) బరోడాతో జరిగే మ్యాచ్ తనకు 137వది. 83 ఏళ్ల రంజీ చరిత్రలో ఏ ఆటగాడు కూడా ఇన్ని మ్యాచ్‌లు ఆడింది లేదు. ఇప్పటిదాకా అమోల్ మజుందార్ (136 మ్యాచ్‌లు) పేరిట ఈ ఘనత ఉంది. మరో రెండు నెలల్లో 40 ఏళ్ల పడిలోకి అడుగుపెట్టబోతున్న ఈ సీనియర్ ఆటగాడు 19 ఏళ్ల వయస్సులో తొలిసారిగా 1995-96 రంజీ కెరీర్‌ను ఆరంభించాడు.

అతడితో ఆడిన ఆటగాళ్లంతా ఇప్పటికే రిటైర్మెంట్ తీసుకుని కోచ్‌లు, అంపైర్లు, వ్యాఖ్యాతలుగా స్థిరపడ్డారు. ఆట పట్ల అంకితభావం, క్రమశిక్షణ వల్లే ఇంత దూరం రాగలిగానని బుందేలా తెలిపాడు. సచిన్, లక్ష్మణ్, ద్రవిడ్, గంగూలీ సమకాలికునిగా క్రికెట్ ఆడడం మరిచిపోలేని అనుభూతి అని అన్నాడు. ‘క్రికెట్‌కు ఎలాంటి ప్రాధాన్యత లేని ఉజ్జరుుని నుంచి అకుంఠిత దీక్షతో జట్టు కెప్టెన్ స్థారుుకి ఎదిగాను. ఎన్నో సవాళ్లు నన్ను రాటుదేల్చారుు. మరికొంత కాలం క్రికెట్‌లో కొనసాగుతాను’ అని బుందేలా చెప్పాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement